సొంతంగా వ్యాపారం.. ఐఐఎం నేర్పిస్తుంది!

ఓ కొత్త ఆలోచనను సమర్థంగా మార్కెట్‌లోకి తీసుకెళ్లడమే విజయవంతమైన వ్యాపారం! అలాంటి బిజినెస్‌లు మొదలుపెట్టాలనుకునే వారి కోసం ఐఐఎం కోల్‌కతా ఓ సరికొత్త ప్రోగ్రాంను మొదలుపెట్టింది. ‘స్టార్టప్‌ రెడీనెస్‌ - గ్రోత్‌ అండ్‌

Updated : 11 Apr 2022 06:29 IST

ఓ కొత్త ఆలోచనను సమర్థంగా మార్కెట్‌లోకి తీసుకెళ్లడమే విజయవంతమైన వ్యాపారం! అలాంటి బిజినెస్‌లు మొదలుపెట్టాలనుకునే వారి కోసం ఐఐఎం కోల్‌కతా ఓ సరికొత్త ప్రోగ్రాంను మొదలుపెట్టింది. ‘స్టార్టప్‌ రెడీనెస్‌ - గ్రోత్‌ అండ్‌ ఎగ్జిక్యూషన్‌ (సర్జ్‌))’ పేరిట 9 నెలల ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

* ఈ ప్రోగ్రాంలో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే యువతకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఐడియాను తీసుకోవడం, దాన్ని సరిగ్గా అమలు చేయడం, సంస్థను నడిపించాల్సి తీరు... ఇలా అన్నీ నేర్పిస్తారు. కోర్సు చివర్లో ప్రతి అభ్యర్థీ ఒక బిజినెస్‌ ఐడియాను సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని ప్యానెల్‌ జడ్జిలు పరిశీలిస్తారు. 

*  ప్రోగ్రాం మొత్తం ఆన్‌లైన్‌లోనే పూర్తిచేయొచ్చు. ప్రతి ఆదివారం పాఠాలుంటాయి. కోర్సు చివర్లో ఒకసారి క్యాంపస్‌ను సందర్శించాల్సి ఉంటుంది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులు. ఒక ఏడాది పని అనుభవం ఉండటం అదనం.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ : https://www.iimcal.ac.in/idp/surge  చూడవచ్చు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని