Updated : 11 Apr 2022 06:29 IST

అపజయాన్ని తట్టుకోండి..

చేతన సాధన

విజయాన్ని ఎంత సంతోషంగా స్వీకరిస్తామో అపజయాన్నీ అంతే దృఢంగా తట్టుకోవడం అవసరం. అప్పుడే చిన్న చిన్న అపజయాలకు భయపడకుండా ఉంటాం. మరి ఓడినప్పుడు కూడా పెదాలపై చిరునవ్వు చెదిరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామా!

తెలుసుకుందాం : ఈ ప్రపంచంలో ఓటమి చవిచూడని వ్యక్తి ఒక్కరు కూడా ఉండరన్న విషయం తెలుసుకోవాలి. తప్పులు అత్యంత సహజం. 

* బాధాకరమే అయినా ఓటములు కొత్త పాఠాలు చెప్పగలవు. వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. 

* ఎటూ ఫెయిల్‌ అయ్యేదానికి ఎందుకు ప్రయత్నించడం అనుకోకూడదు. మళ్లీ ప్రయత్నమే చేయకపోతే విజయం ఎలా దక్కుతుంది?

* మానసిక పరిపక్వత సాధించాలంటే అపజయం తప్పనిసరి. అప్పుడే ఒక విషయాన్ని మరోకోణంలో అర్థం చేసుకోవడం మొదలుపెడతాం. ఆ క్రమంలో ఎదుగుతాం.

* ఏది ఓటమి అనే విషయం తెలుసుకోవడం కూడా ముఖ్యమే. కొన్నిసార్లు మన అభిప్రాయం, ఆలోచన పొరపాటయ్యే అవకాశం ఉంది కదా!

ఆచరిద్దాం: - మీ ఫ్రెండే ఈ పరిస్థితిలో ఉంటే తనకి మీరు ఎలా ధైర్యం చెబుతారు? మీకు మీరే అలా చెప్పుకోవాలి.  ఇదే ‘సెల్ఫ్‌ కంపాషన్‌’. 

* జరిగినదాన్నే తలుచుకుని బాధపడటం వల్ల అక్కడే ఆగిపోతారు. కొంత సమయం తీసుకుని మన ఎమోషన్స్‌ను పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నాక తిరిగి మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలి. 

* కారెల్‌ డ్వెక్‌ లాంటి ప్రముఖ సైకాలజిస్టుల రిసెర్చ్‌ వీడియోలు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి.   అటువంటి వాటిని చూడటం వల్ల ‘సిచ్యువేషన్‌ హ్యాండ్లింగ్‌’ అర్థమవుతుంది.  

* ‘ఫ్యామిలీ ఈజ్‌ అల్టిమేట్‌’ అనేది నిజం. విజయంలోనే కాదు, అపజయంలోనూ మనవాళ్లు మనతో ఉంటారు. మానసికంగా కోలుకునేందుకు వారి సాయం తీసుకోవాలి. 

* ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రేరణ (మోటివేషన్‌)ను కోల్పోకూడదు. ఈ అపజయానికి కారణం ఏంటని వెతికే ‘సెల్ఫ్‌ అనాలిసిస్‌’ అవసరం.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని