బాగా నిద్రిస్తేనే.. అన్నీ గుర్తుండేది!

పరీక్షలంటే రాత్రంతా మేలుకొని చదివేవారు బోలెడుమంది. అలా చదవడంలో ఇబ్బంది లేదుకానీ... దానివల్ల కోల్పోయిన నిద్ర సంగతేంటి? సరిపడా గాఢనిద్ర లేకపోతే చదివింది గుర్తుంటుందా? తెలుసుకుందాం..

Updated : 21 Apr 2022 05:23 IST

పరీక్షలంటే రాత్రంతా మేలుకొని చదివేవారు బోలెడుమంది. అలా చదవడంలో ఇబ్బంది లేదుకానీ... దానివల్ల కోల్పోయిన నిద్ర సంగతేంటి? సరిపడా గాఢనిద్ర లేకపోతే చదివింది గుర్తుంటుందా? తెలుసుకుందాం..

* డబ్ల్యూహెచ్‌వో (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) సూచన ప్రకారం ఇంటర్‌, ఆపైన చదివే విద్యార్థులు 8 గంటలపాటు కచ్చితంగా నిద్రపోవాలి. కానీ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) అనే అమెరికన్‌ ప్రభుత్వ సంస్థ సర్వే ప్రకారం ఈ వయసు విద్యార్థుల్లో ప్రతి పది మందిలో ఏడుగురు అంటే 72.7శాతం మంది సరిపడా నిద్రపోవడం లేదని తేలింది.

తక్కువ నిద్రపోతున్న విద్యార్థులు తరగతిగదిలో శ్రద్ధ పెట్టలేకపోవడం, మార్కులు సాధించడంలో విఫలం కావడం, పాఠాలు గుర్తుండకపోవడం, మానసిక సమస్యల వంటివాటి బారిన పడుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. - మంచి గ్రేడ్లు సాధించాలన్నా, పరీక్షల్లో నెగ్గాలన్నా, చదువులో పురోగతి సాధించాలన్నా సరిపడా నిద్ర తప్పనిసరి. ఏది మానుకున్నా, దీనికి మాత్రం సమయం కేటాయించాల్సిందే.

రేపు సెలవే కదా అని ముందురోజు పొద్దుపోయేదాకా మేలుకుని ఉండటం, మరుసటి రోజు పొద్దున్నే లేవకపోవడం సరికాదు. సెలవులైనా, పరీక్షలైనా.. ప్రతిరోజు ఒకేటైంకి నిద్రపోవడం, మేలుకోవడం అలవాటు చేసుకుంటే శరీరానికి ఆ పద్ధతి అలవాటవుతుంది. - తక్కువ కాంతినిచ్చే బెడ్‌లైట్‌, సౌకర్యవంతమైన మంచం, మంద్రమైన సంగీతంతో నిద్రలోకి జారుకుంటే... అటు చదువుకీ మంచిది, ఇటు ఆరోగ్యానికీ మంచిది!

* ఎట్టిపరిస్థితుల్లోనూ మంచం మీద ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివి వాడకూడదు. నిద్రపోయేముందు వీడియోగేమ్స్‌ వంటివి వాడితే మెదడు ఉత్తేజితమై అసలు నిద్రపట్టనీయకుండా చేస్తుంది. ఒత్తిడికి గురిచేసే క్రైం, సస్పెన్స్‌, యాక్షన్‌ సినిమాలు చూడటం కూడా అంత మంచిది కాదు. ఇది విద్యార్థులు కచ్చితంగా పాటించాల్సిన నియమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని