చదివినవి గుర్తుండాలంటే...

ఎన్నిసార్లు చదివినా గుర్తుండటం లేదా... దీంతో సమయం వృథా అవుతోందని బాధపడుతున్నారా... కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చంటున్నాయి అధ్యయనాలు. 

Updated : 25 Apr 2022 06:31 IST

ఎన్నిసార్లు చదివినా గుర్తుండటం లేదా... దీంతో సమయం వృథా అవుతోందని బాధపడుతున్నారా... కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చంటున్నాయి అధ్యయనాలు. 

పాఠ్య విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలంటే దాన్ని రికార్డు చేసుకుని వినొచ్చు. ఒక అంశాన్ని మీరే చదివి, సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకుని తరచూ వినడం వల్ల ఫలితం ఉంటుంది. 
చదివినదాన్ని చూడకుండా రాయడం వల్ల కూడా ఉపయోగముంటుంది. విషయం మీకు ఎంతవరకు గుర్తుందనేది తెలుస్తుంది. మళ్లీ మళ్లీ రాయడం వల్ల చదివిన దాన్ని త్వరగా మర్చిపోలేరు.
ఎక్కువ సమాచారాన్ని ఒకేసారి గుర్తుంచుకోవాలని ప్రయత్నించకూడదు. దాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించాలి. ఇలా చేయడం వల్ల విషయం సులువుగా గుర్తుంటుంది. 
సమాచారంలోని ముఖ్యాంశాలను మార్కర్‌తో హైలైెట్‌ చేసుకోవాలి. అలా చేసుకున్న విషయాలను త్వరగా మర్చిపోలేరు. 
మీకు తెలిసిన విషయాన్ని ఇతరులకు వివరిస్తే అది ఎక్కువ కాలంపాటు గుర్తుండిపోతుంది. మీరు చెప్పేది వినడానికి సమయానికి ఎవరూ అందుబాటులో లేరనుకోండి...అద్దం ముందు నిలబడి కూడా వినిపించొచ్చు. 
ముఖ్యాంశాలను స్నేహితులతో చర్చించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. అలా చర్చించిన విషయాలను త్వరగా మర్చిపోలేరు. 
చదువు మధ్యలో విరామం తీసుకోవడమూ అవసరమే.ఆరుబయట నడవడం, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయవచ్చు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని