TS Exams 2022: సూర్యుడి సునామీలు... అరోరాలు!
అనునిత్యం అందరినీ అలరించే సూర్యుడికి సంబంధించి అనేకానేక ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. ఆయనకో కుటుంబం ఉంది. అదో ఖగోళ స్వరూపాల సమూహం. అవన్నీ కలిసి అందులోనే భాగమైన భూమిపై, తద్వారా మన జీవితాలపై ప్రభావాన్ని చూపుతుంటాయి.
ప్రపంచ భూగోళశాస్త్రం
అనునిత్యం అందరినీ అలరించే సూర్యుడికి సంబంధించి అనేకానేక ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. ఆయనకో కుటుంబం ఉంది. అదో ఖగోళ స్వరూపాల సమూహం. అవన్నీ కలిసి అందులోనే భాగమైన భూమిపై, తద్వారా మన జీవితాలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. పరీక్షార్థులు ఆ వివరాలను తెలుసుకోవాలి. సూర్యుడు, ఆయన ప్రకాశానికి, ఉష్ణోగ్రతకు కారణాలు; గ్రహాలు, వాటి రకాలు, ధర్మాలు; నక్షత్రాలు, ఖగోళ ప్రమాణాలపై స్థూల అవగాహన ఏర్పరచుకోవాలి.
సౌర కుటుంబం
సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ తన చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలు, లఘు గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, అంతర గ్రహ ధూళి అనే ఖగోళ స్వరూపాల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు.
సూర్యుడు-ఉష్ణోగ్రత వ్యత్యాసాలు
ఇది ఒక స్వయం ప్రకాశ శక్తి ఉన్న మధ్యస్థ స్థాయి నక్షత్రం. దీని వయసు 5.5 బిలియన్ సంవత్సరాలు. భూమికి అతి సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుడు. దీని తర్వాత అతి సమీపంలో ఉన్న రెండో నక్షత్రం ప్రాక్సిమా సెంటారియా. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలు. సూర్యుడు తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే కాలం 25 రోజులు. గెలాక్సీ కేంద్రకం చుట్టూ ఒకసారి తిరగడానికి సూర్యుడికి 250 మిలియన్‌ల సంవత్సరాలు పడుతుంది. దీన్నే కాస్మిక్ సంవత్సరం అంటారు. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న సగటు దూరం 149.5 మిలియన్ కి.మీ. లేదా 1 ఆస్ట్రానామికల్ యూనిట్. సూర్యుడిలో హైడ్రోజన్ 71 శాతం, హీలియం 26.5 శాతం, మిగిలిన 2.5 శాతం ఇనుము, సిలికాన్, కార్బన్, ఆక్సిజన్ లాంటి పదార్థాలు ఉంటాయి.
సూర్యుడి ఉపరితల వాతావరణంలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని అనుసరించి దాన్ని మూడు భాగాలుగా విభజించారు.
1) ఫొటోస్ఫియర్ (కాంతి మండలం): ఇది మనకు పగటి సమయంలో ప్రకాశవంతంగా కనిపించే సూర్యుడి ఉపరితలం. ఇందులో 6000°C ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ప్రాంతంలోని నల్లటి కాంతిహీనమైన మచ్చలను సూర్యాంకాలు లేదా సన్ స్పాట్స్ లేదా బ్లాక్ స్పాట్స్ అని పిలుస్తారు. ఈ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి (1000 - 1500°C)
సూర్యుడి ఫొటోస్ఫియర్ ప్రాంతంలో న్యూట్రాన్ అణువుల ఉద్గారం తక్కువ స్థాయిలో జరిగితే వాటిని సౌర పవనాలు అంటారు. ఇవి భూ వాతావరణంలోకి వచ్చి అక్కడ ఉన్న దుమ్ము, ధూళి కణాలపై పడి వివర్తనం చెందినప్పుడు ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ వర్ణం పట్టీలు ఏర్పడతాయి. వీటినే అరోరాలు అని పిలుస్తారు. ఉత్తరార్ధ గోళంలో వీటిని అరోరా బోరియాలసిస్, దక్షిణార్ధ గోళంలో అరోరా ఆస్ట్రాలిస్ అని పిలుస్తారు. సూర్యాంకాల నుంచి వెలువడే ఆవేశ పూరిత విద్యుత్ కణాల సమూహాన్ని సౌర జ్వాలలు అని పిలుస్తారు.
2) క్రోమోస్ఫియర్ (వర్ణావరణం): ఇది ఫొటోస్ఫియర్ పైన ఎరుపు, ఆరెంజ్ రంగులో ఉండే భాగం . ఇక్కడ ఉష్ణోగ్రతలు 3,20,000°C వరకు ఉంటాయి. ఈ ప్రాంతం సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మూలకాల ఉనికిని తెలియజేసే నల్లటి కాంతి హీనమైన రేఖలు ఏర్పడి ఉంటాయి. వీటిని ప్రాన్‌హోపర్‌లు అని పిలుస్తారు.
3) కరోనా (సూర్యకాంతి పరివేశం): ఇది క్రోమోస్ఫియర్ పైభాగంలో అత్యధిక ఉష్ణోగ్రతలు గల ప్రాంతం. ఇది గ్రహణ సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. సూర్యుడిలోని థర్మో న్యూక్లియర్ చర్యలన్నీ దీనిలోనే జరుగుతాయి.
గ్రహాలు రెండు రకాలు
భూకక్ష్యను ఆధారంగా చేసుకొని గ్రహాలను రెండు రకాలుగా విభజించవచ్చు.
నిమ్నత గ్రహాలు: ఈ గ్రహాలు భూకక్ష్యకు లోపల సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. అవి బుధుడు, శుక్రుడు.
ఉన్నత గ్రహాలు: ఈ గ్రహాల కక్ష్యలు భూకక్ష్యకు ఆవల ఉంటాయి. అవి అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు, యముడు.
గ్రహాల భౌతిక ధర్మాలు
గ్రహాల భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకొని వాటిని రెండు రకాలుగా విభజించవచ్చు.
అంతర గ్రహాలు (టెరెస్ట్రియల్): పరిమాణంలో ఇవి చిన్నగా ఉంటాయి.శిలా నిర్మితాలు, అధిక సాంద్రత, ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయి. ఉదా: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు
బాహ్య గ్రహాలు (జోవియస్): ఇవి హైడ్రోజన్ లాంటి అనేక వాయువులు ద్రవీభవించగా ఏర్పడ్డాయి. తక్కువ సాంద్రత, ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయి.
ఉదా: బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు, ప్లూటో (యముడు).
పరిధి మూడు భాగాలు
సౌరకుటుంబ పరిధిని మూడు భాగాలుగా విభజించవచ్చు.
1) గ్రహాల పరిధి: ఇందులో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్ ఉంటాయి.
గ్రహాలు: తమ ఊహాత్మక అక్షం చుట్టూ తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ సూర్యుడి నుంచి వెలుతురు, వేడిని పొందే ఖగోళ స్వరూపాలను గ్రహాలు అంటారు. ప్రస్తుతం సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. 2006 అక్టోబరు 24న చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ సమావేశంలో ప్లూటోకు గ్రహ స్థాయి లేదని దాన్ని మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు.
ప్లూటో గ్రహ స్థాయి తొలగింపునకు కారణాలు : సౌర కుటుంబంలో ఏదైనా ఖగోళ వస్తువును గ్రహంగా పేర్కొనాలి అంటే అది సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార మార్గంలో తిరగాలి. కానీ ప్లూటో కక్ష్యా మార్గం అతి దీర్ఘవృత్తాకార మార్గంలో ఉంది. దాని కక్ష్యా మార్గంలోకి ప్రవేశించే ఇతర ఖగోళ పదార్థాలను తొలగించేందుకు తగినంత గురుత్వాకర్షణ శక్తి ఉండాలి. కానీ ప్లూటో కక్ష్యా మార్గంలో ఇప్పటికీ అనేక చిన్న చిన్న ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. దీనికి కారణం వాటిని తొలగించడానికి కావాల్సిన గురుత్వాకర్షణ శక్తి ప్లూటోకు లేదు. దీని కక్ష్యామార్గం ఇప్పటికీ నెప్ట్యూన్ కక్ష్యను అనుసరిస్తుంది.
2) కూపియర్ బెల్ట్: నెప్ట్యూన్ గ్రహ కక్ష్యకు అవతల ఉన్న సౌర కుటుంబంలోని ప్రాంతాన్ని కూపియర్ బెల్ట్ అని పిలుస్తారు. ఇందులో తోకచుక్కలు, మరుగుజ్జు గ్రహాలు ఉంటాయి. ప్రస్తుతం సౌర కుటుంబంలో సెరస్, ప్లూటో, ఎరిస్, డిస్మోమియా, సెడ్నాలను మరుగుజ్జు గ్రహాలుగా పేర్కొంటున్నారు.
3) ఊర్ట్ క్లౌడ్ రీజియన్: ఇది క్యూపియర్ బెల్టు అవతల ఉన్న ప్రాంతం.ఈ ప్రాంతంలో సుదూరంగా ఉన్న తోక చుక్కలు ఉంటాయి. దీనితో సౌరకుటుంబ పరిధి ఆగిపోతుంది.
నక్షత్ర ఆవిర్భావ పరిణామక్రమం- దశలు
విశ్వపదార్థంలో జరిగే అణుసంలీన చర్య వల్ల విడుదలయ్యే శక్తి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో వెలువడుతుంది. ఇది వివిధ కాస్మిక్ పదార్థాలుగా మారుతూ నక్షత్ర దశల్లోకి పరిణామం చెందుతుంది. మళ్లీ నక్షత్రాల్లోని వాయువు తరిగిపోవడం వల్ల అవి స్వయం ప్రకాశక శక్తిని క్రమంగా కోల్పోతూ నోవా, సూపర్‌నోవా దశలోకి చేరి చివరకు బ్లాక్‌హోల్‌గా మారతాయి. ఈ క్రమంలో ఏర్పడిన దశలు..
న్యూట్రాన్ నక్షత్రాలు (Pulsar): నాడి కొట్టుకుంటున్న తరహాలో విద్యుదయస్కాంత శక్తిని వెలువరించే నక్షత్రాలు.
అర్ధ నక్షత్రాలు (Quasar): పూర్తిస్థాయి నక్షత్ర దశను పొందక ముందు శక్తిజనక ప్రక్రియ ప్రారంభమైన నక్షత్రాలు.
స్థిర నక్షత్రాలు (Fixed Stars): కేంద్రక సంలీన చర్య ప్రారంభమైన తర్వాత నిలకడగా ఒకే ప్రకాశ శక్తితో కనిపించే వాటిని స్థిర నక్షత్రాలు.
ప్రిపరేషన్ టెక్నిక్
భూగోళశాస్త్రానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఎప్పటికీ మార్పుచెందని ప్రాథమిక అధ్యాయాల నుంచి వస్తుంటాయి. అభ్యర్థులు ముందుగా వాటి ప్రిపరేషన్ పూర్తిచేసుకొని తర్వాత కోర్ జాగ్రఫీపై దృష్టిపెట్టాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mamata Banerjee: కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్ ఓటమి: మమత
-
CM Jagan: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్
-
Trisha: నెటిజన్ల విమర్శలు.. ‘యానిమల్’పై పోస్ట్ తొలగించిన త్రిష
-
Bigg boss telugu 7: ఆటలు ఆడకపోయినా అందుకే శివాజీ హౌస్‌లో ఉంటున్నారు: గౌతమ్‌కృష్ణ
-
Hamas: 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం
-
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత