తోటివారి ఒత్తిడి ఎక్కువైతే..!

‘స్నేహితుల ఒత్తిడితోనే అలా చేశాను. నిజానికి నేనలా చేయాలని అనుకోలేదు... ఇలాంటి సమాధానాలు ఎక్కువగా యువత నోటి నుంచి వినిపిస్తూనే ఉంటాయి. ప్రతికూలాంశాల్లో తోటివారి ఒత్తిడికి గురై ఆచరించి, ఆ తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటారు కొంతమంది.

Published : 22 Jun 2022 01:23 IST

‘స్నేహితుల ఒత్తిడితోనే అలా చేశాను. నిజానికి నేనలా చేయాలని అనుకోలేదు... ఇలాంటి సమాధానాలు ఎక్కువగా యువత నోటి నుంచి వినిపిస్తూనే ఉంటాయి. ప్రతికూలాంశాల్లో తోటివారి ఒత్తిడికి గురై ఆచరించి, ఆ తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటారు కొంతమంది. అలాకాకుండా ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

* మొహమాటంతో ఎదుటివాళ్లు చెప్పిందల్లా వినడం, చేయడం సరి కాదు. మీ ప్రతిస్పందలనూ తెలియజేయాలి. అలాగే దానికి వారంతా సానుకూలంగా స్పందించాలని ఆశించడమూ సరికాదు. మీ అభిప్రాయాలను తెలియజేయడం వరకే మీ పని.

* మిత్రుల ఒత్తిడితో.. కాలేజీలో తోటివారిని హేళన చేయడం, అల్లర్లకు దిగడం... లాంటివి చేస్తుంటారు కొందరు. మీరలా చేస్తే చివరికి వాటన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సిందీ, వాటన్నింటికీ అంతిమంగా బాధ్యత వహించాల్సిందీ మీరేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

* తోటివారి ప్రభావం నుంచి త్వరగా బయటపడాలంటే ‘వద్దు, కాదు’ అనే సమాధానం చెప్పడాన్ని ముందుగా అలవాటు చేసుకోవాలి. అయితే ఇలా చెప్పడం మొహానకొట్టినట్టుగా కాకుండా కాస్త సున్నితంగా, లౌక్యంగా ఉండాలి.

* ఇతరుల ఒత్తిడితో చేసే పనుల వల్ల వచ్చే పర్యవసానాల గురించి తెలివిగా ఆలోచించాలి. సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి.  

* ఎదుటివారి ఒత్తిడికి లోనై ఎటూ నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో..ఆప్తులు, సీనియర్ల, కుటుంబసభ్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం శ్రేయస్కరం.

* సాధారణంగా మన మీద మనకు నమ్మకం లేనప్పుడు తోటివాళ్లు పెట్టే ఒత్తిడి, ప్రలోభాలకు ఎక్కువగా లోనవుతుంటాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.

* ఇతరులు ఒత్తిడి తెచ్చినప్పుడు వెంటనే సీరియస్‌గా స్పందించడమూ మంచిది కాదు. దానికి మీరు సానుకూలంగా లేరనే విషయాన్ని కాస్త సున్నితంగానే తెలియజేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని