ముందు కలిస్తే నిజం.. తర్వాత అంతా మిథ్య!
జనరల్ స్టడీస్ - ఫిజిక్స్
ఇంట్లో కాస్త తయారై బయటకు వెళ్లేటప్పుడు, బైక్ లేదా కారు నడిపేటప్పుడు వెనుక వచ్చే వాహనాలను గమనించడానికి, డెంటిస్టులు వైద్యం చేసేటప్పుడు కొన్ని దర్పణాలు అంటే అద్దాలను ఉపయోగిస్తుంటారు. అవి కాంతి పరావర్తన నియమాలపై ఆధారపడి పనిచేస్తాయి. కిరణాలు దర్పణంపై పతనం చెందక ముందు, చెందిన తర్వాత ఒక బిందువు వద్ద కలుసుకొని ప్రతిబింబాలను ఏర్పరుస్తుంటాయి. వాటి వెనుక ఉన్న ఫిజిక్స్ సూత్రాలపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి.
కాంతి - దర్పణాలు
కాంతిని పరావర్తనం చెందించగలిగి, స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరిచే పరావర్తన తలాన్ని దర్పణం అంటారు. దర్పణాలు కాంతి పరావర్తన సూత్రాలపై ఆధారపడి పనిచేస్తాయి. శాస్త్రీయంగా ఈ దర్పణాలను గాజు పలకకు ఒకవైపు లోహపు పూత వేసి తయారుచేస్తారు. ఈ దర్పణాలపై కాంతి పరావర్తనం చెందడం వల్ల వివిధ రకాల ప్రతిబింబాలు ఏర్పడతాయి.
రకాలు: పరావర్తన తలం ఆధారంగా దర్పణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1) సమతల దర్పణాలు 2) గోళాకార లేదా వక్రతా దర్పణాలు
సమతల దర్పణాలు
ఈ రకమైన దర్పణాల్లో పరావర్తన తలం, లోహపు పూత వేసిన తలం రెండూ సమతలంగా ఉంటాయి. ఇవి ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. పరావర్తన కిరణాలు దర్పణంపై పతనం చెందిన తర్వాత ఏ బిందువు వద్ద ఏకీభవిస్తున్నట్లు అనిపిస్తుందో ఆ బిందువునే మిథ్యా ప్రతిబింబం అంటారు. ఒకవేళ పరావర్తన కిరణాలు దర్పణం ముందు నిజంగా కలుసుకుంటే ఆ బిందువును నిజ ప్రతిబింబం అంటారు.
అనువర్తనాలు:
* నిత్యం ఇళ్లల్లో ఉపయోగిస్తాం.
* సెలూన్ షాప్, మిఠాయి దుకాణాల్లో వాడతాం.
గమనిక: సెలూన్, మిఠాయి దుకాణాల్లో రెండు సమతల దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా చూస్తారు. ఫలితంగా వాటిలో అనంత ప్రతిబింబాలు ఏర్పడతాయి.
* పరావర్తన పెరిస్కోప్‌లలో ఉపయోగిస్తారు.
పరావర్తన పెరిస్కోప్: జలాంతర్గాముల్లో ఉండి ఉపరితలాల శత్రు నౌకలను చూడటానికి, యుద్ధ రంగంలో గుంతలు, పర్వతాల వెనుక భాగంలో ఉండి శత్రు కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని పెరిస్కోప్ అంటారు. ఇది సాధారణంగా z ఆకారంలో ఉంటుంది. దీనిలో రెండు సమతల దర్పణాలను ఉపయోగిస్తారు.
గోళాకార దర్పణాలు
గుల్ల గాజు గోళం నుంచి గోళాకార దర్పణాలను తయారుచేస్తారు. ఇవి రెండు రకాలు.
పుటాకార దర్పణం: ఈ రకమైన దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా పనిచేస్తుంది. ఇది వస్తు స్థానం ఆధారంగా నిజ, మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. దీన్ని అభిసరణి లేదా కేంద్రీకృత లేదా వైద్యుడి దర్పణం లేదా మాగ్నిఫైయింగ్ దర్పణం అని కూడా అంటారు.
అనువర్తనాలు:
* సోలార్ కుక్కర్, సోలార్ హీటర్ తయారీలో పుటాకార దర్పణాలను వాడతారు.
* పరావర్తన టెలిస్కోపుల్లో (ఖగోళ వస్తువులను చూడటానికి ఉపయోగించే దృక్ సాధనం), వాహనాల హెడ్‌లైట్ల వెనుక భాగంలో వాడతారు.
* టార్చ్‌లైట్ల వెనుక భాగంలో ఉపయోగిస్తారు.
* సెమినార్ లేదా క్లాస్‌రూమ్ ప్రొజెక్టర్‌లలో వినియోగిస్తారు.
* దంత వైద్యుడు, ఈఎన్‌టీ స్పెషలిస్టులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
* దీన్ని షేవింగ్ మిర్రర్‌గా ఉపయోగిస్తారు.
* టీవీ, డీటీహెచ్ డిష్‌లను పుటాకారంగా అమరుస్తారు.
కుంభాకార దర్పణం: ఈ రకమైన దర్పణంలో కుంభాకార తలం పరావర్తన తలంలా పనిచేస్తుంది. ఇది వస్తువుని ఏ స్థానంలో ఉంచినా ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్నే ఏర్పరుస్తుంది. ఈ దర్పణాన్ని ఉపయోగించి సమతల దర్పణం కంటే ఎక్కువ ప్రాంతాన్ని చూడవచ్చు. దీన్ని అపసరణి లేదా వికేంద్రీకృత లేదా భద్రత దర్పణం అని కూడా అంటారు.
అనువర్తనాలు:
* వాహనాల్లో డ్రైవర్‌ల పక్కన రియర్ వ్యూ మిర్రర్‌గా వాడతారు.
* వీధి దీపాల వెనుక భాగంలో పరావర్తకాలుగా ఉపయోగిస్తారు.
* ఏటీఎం యంత్రాల్లో పిన్ భద్రతా దర్పణంగా వినియోగిస్తారు.
* పరిశ్రమలు, రోడ్డు మలుపుల వద్ద భద్రతా దర్పణంగా వాడతారు.
* విమానాశ్రయాల రన్‌వేల పక్కన అమరుస్తారు.
* షాపింగ్ మాల్, రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లలో వీటిని ఉపయోగిస్తారు.
* పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను వెనక్కి తీసుకోవడానికి కుంభాకార దర్పణాలను అమరుస్తారు.
* చలువ కళ్లద్దాల బాహ్యతలం కుంభాకార దర్పణంలా పనిచేస్తుంది.
మాదిరి ప్రశ్నలు
1. ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే దర్పణాలు?
1) పుటాకార, కుంభాకార ద]ర్పణం 2) పుటాకార, సమతల దర్పణం
3) కుంభాకార, సమతల దర్పణం 4) ఏదీకాదు
2. పరావర్తన పెరిస్కోప్‌లో ఉపయోగించే దర్పణం?
1) పుటాకార దర్పణం 2) కుంభాకార దర్పణం
3) సమతల దర్పణం 4) ఏదీకాదు
3. మిఠాయి దుకాణాల్లో అనంత ప్రతిబింబాలు కనిపించడానికి కారణం సమతల దర్పణాలను ఒకదానికొకటి?
1) లంబంగా అమర్చడం 2) సమాంతరంగా అమర్చడం
3) కొత్తకోణంతో అమర్చడం 4) చెప్పలేం
4. జాతీయ రహదారుల వంపుల వద్ద అమర్చే దర్పణం?
1) కుంభాకార దర్పణం 2) పుటాకార దర్పణం
3) సమతల దర్పణం 4) ఏదీకాదు
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth reddy: మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు చాలా కీలకం: రేవంత్‌రెడ్డి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట: ఈవో
-
Movies News
#NBK108: బాలయ్య - అనిల్ రావిపూడి కాంబో.. ఇంట్రో బీజీఎం అదిరిందిగా!
-
Movies News
ఆ సినిమా చూశాక నన్నెవరూ పెళ్లి చేసుకోరని అమ్మ కంగారు పడింది: ‘MCA’ నటుడు
-
India News
CJI: ప్లీజ్.. మాస్కులు పెట్టుకోండి.. లాయర్లకు సీజేఐ సూచన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ