ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌గా పదోతరగతి చేశాను. నాకు తెలంగాణ స్థానికత వర్తిస్తుందా?

Published : 22 Jun 2022 01:49 IST

నేను ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌గా పదోతరగతి చేశాను. నాకు తెలంగాణ స్థానికత వర్తిస్తుందా?

- సాంబ
జ: మీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా తెలంగాణలోనే జరిగింది కాబట్టి ఇక్కడి స్థానికత కచ్చితంగా వర్తిస్తుంది.


నేను డిగ్రీ పాసై గ్రూప్‌-2కి ప్రిపేర్‌ అవుతున్నాను. 2018లో నాపై ఐపీసీ 337 కింద యాక్సిడెంట్‌ కేసు నమోదైంది. తర్వాత లోక్‌ అదాలత్‌లో రాజీ కుదరడంతో కేసు కొట్టేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉందా? దరఖాస్తులో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలా?

- మహ్మద్‌
జ: శిక్షపడలేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే దరఖాస్తులో వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.


ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఓపెన్‌ డిగ్రీ పూర్తి చేశాను. తెలంగాణలో డిగ్రీ అర్హతతో వచ్చే నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చా?
జ: మీరు నిస్సంకోచంగా తెలంగాణలో డిగ్రీ అర్హతతో వచ్చే నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

ఆర్థిక సర్వేలు, బడ్జెట్‌ నివేదికలు చాలా విస్తృతంగా ఉంటాయి. అంతా నేర్చుకుంటూ పోతే పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా సమయం వృథా. ఆ గణాంకాల్లో అవసరమైనవి ఏమిటో తెలుసుకోవాలంటే ప్రామాణిక వార్తాపత్రికలు, నిపుణులు అందించే ముఖ్యాంశాలను చదవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని