Published : 23 Jun 2022 00:44 IST

కరెంట్‌ అఫైర్స్‌

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్‌

ఐరాసలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా సీనియర్‌ దౌత్యవేత్త రుచిరా కంబోజ్‌ 2022 జూన్‌ 21న నియమితులయ్యారు. ఇంతవరకు ఆ స్థానంలో ఉన్న టి.ఎస్‌.తిరుమూర్తి స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. 1987 బ్యాచ్‌ ‘ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌’ (ఐఎఫ్‌ఎస్‌) అధికారిణి అయిన ఆమె ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా ఉన్నారు.


తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా తెరాస ప్రవాస విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్‌కో) ఛైర్మన్‌గా తెరాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్‌ ఏరువ సతీష్‌రెడ్డి నియమితులయ్యారు. వీరిద్దరూ తమ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఒకే దేశం.. ఒకే రేషన్‌కార్డు’ పథకంలో చివరి రాష్ట్రంగా అస్సాం చేరినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో ఈ కార్యక్రమం దేశంలో వంద శాతం అమలు కానుంది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.


అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక నేటివ్‌ అమెరికన్‌ మహిళ ఆ దేశ ట్రెజరర్‌గా నామినేట్‌ అయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌ 2022 జూన్‌ 21న లిన్‌ మలెర్బాను ట్రెజరర్‌గా నియమించారు. ట్రెజరర్‌ విధుల్లో టంకశాల పర్యవేక్షణ, ఫెడరల్‌ రిజర్వ్‌ సిస్టమ్‌తో సమన్వయం వంటివి ఉంటాయి.


దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష రాకెట్‌ ‘నురి’ని దక్షిణ కొరియా ఈ నెల 21న విజయవంతంగా ప్రయోగించింది. దీని సాయంతో ఒక ఉపగ్రహాన్ని 700 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి పంపింది. స్వీయ సామర్థ్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన పదో దేశంగా దక్షిణ కొరియా గుర్తింపు పొందింది. నురి పొడవు 47 మీటర్లు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని