ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను గ్రూప్‌-1 కి ప్రిపేర్‌ అవుతున్నాను. రిజిస్ట్రేషన్‌లో పదోతరగతి హాల్‌ టికెట్‌ నంబర్‌లోని ఒక అంకె తప్పుగా నమోదు చేశాను. దీనివల్ల ఉద్యోగ సాధనలో ఏదైనా సమస్య ఉంటుందా?

Published : 23 Jun 2022 00:51 IST

నేను గ్రూప్‌-1 కి ప్రిపేర్‌ అవుతున్నాను. రిజిస్ట్రేషన్‌లో పదోతరగతి హాల్‌ టికెట్‌ నంబర్‌లోని ఒక అంకె తప్పుగా నమోదు చేశాను. దీనివల్ల ఉద్యోగ సాధనలో ఏదైనా సమస్య ఉంటుందా?

- ఒక అభ్యర్థి

జ: ఎలాంటి సమస్యా ఉండదు. ఏ సంకోచం లేకుండా గ్రూప్‌-1 ప్రిపరేషన్‌పై శ్రద్ధ పెట్టండి.

గ్రూప్‌-4 పేపర్‌-1, పేపర్‌-2కి మధ్య కొద్ది రోజుల విరామం ఉంటుందా లేదా ఉదయం ఒక పేపర్‌, సాయంత్రం ఒక పేపర్‌ జరుగుతాయా?

- రాజేష్‌

జ: గ్రూప్‌-4 పేపర్‌-1, పేపర్‌-2కి మధ్య కొంత విరామం ఉంటుంది. కానీ ఒకే రోజులో పూర్తవుతాయి.

గ్రూప్‌-4, సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఏకకాలంలో ప్రిపరేషన్‌ను ఎలా సాగించాలో తెలియజేయండి.

- గుగ్గిళ్ల విజయ్‌

జ: రెండింటికీ చాలావరకు కామన్‌ సిలబస్‌ ఉంటుంది. సబ్‌-ఇన్‌స్పెక్టర్‌కు చదివితే పరోక్షంగా గ్రూప్‌-4కి కూడా సరిపోతుంది. తర్వాత కామన్‌గాలేని వాటిని నేర్చుకుంటే ఏకకాలంలో గ్రూప్‌-4, సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ప్రిపరేషన్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని