Published : 24 Jun 2022 01:28 IST

కరెంట్‌ అఫైర్స్‌

తెలంగాణ పోలీసులకు సీసీటీఎన్‌ఎస్‌ పురస్కారం

సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ముందున్న తెలంగాణ పోలీసులు క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ హ్యాకథాన్‌ అండ్‌ సైబర్‌ ఛాలెంజ్‌ 2022 పురస్కారాన్ని పొందారు. సైబర్‌ నేరాల నియంత్రణకు రాష్ట్ర పోలీసులు వినియోగిస్తున్న సైబర్‌ క్రైమ్‌ అనాలసిస్‌ అండ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టమ్‌ (సైక్యాప్స్‌) ఐటీ అప్లికేషన్‌ దేశంలోనే తొలి స్థానం సాధించింది. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఎస్పీ దేవేందర్‌ సింగ్‌ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.


భారత్‌లో మలేరియా కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు ‘మలేరియా నో మోర్‌’ సంస్థ నివేదిక వెల్లడించింది. 2015 నుంచి 2021 మధ్య ఈ సంస్థ చేసిన అధ్యయనం మేరకు కేసుల్లో 86 శాతం తగ్గుదల నమోదు కాగా, మరణాలు 79 శాతం తగ్గాయి.


దేశ అగ్రశ్రేణి సైక్లిస్ట్‌ రొనాల్డో సింగ్‌ ఆసియా ట్రాక్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత సైక్లిస్ట్‌గా రికార్డు నమోదు చేశాడు. సీనియర్‌ స్ప్రింట్‌ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. కెంటో యమసాకి (జపాన్‌), ఆండ్రీ (కజకిస్థాన్‌) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.


ప్రముఖ ఇండో - అమెరికన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్తీ ప్రభాకర్‌ను (63) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన సైన్స్‌ సలహాదారుగా కీలక స్థానంలో నామినేట్‌ చేశారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకం అంటూ ఇండో - అమెరికన్‌ వర్గం ప్రశంసించింది.


భారత యువ రెజ్లర్లు కిర్గిజ్‌స్థాన్‌లో జరుగుతున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-17 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో నాలుగు స్వర్ణాలు, రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలు ఉన్నాయి. ఒక్కరోజే మన రెజ్లర్లు ఫ్రీస్టైల్‌లో మూడు బంగారు పతకాలు, ఒక రజతం, కాంస్యం గెలిచారు. నింగప్ప (45 కేజీలు), శుభమ్‌ (48 కేజీలు), వైభవ్‌ పాటిల్‌ (55 కేజీలు)ల్లో ఒక్కొక్కరు ఒక్కో పసిడి సాధించారు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని