కరెంట్‌ అఫైర్స్‌

నీతి ఆయోగ్‌ సీఈఓగా 1981 బ్యాచ్‌ యూపీ క్యాడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న అమితాబ్‌కాంత్‌ పదవీకాలం 2022 జూన్‌ 30న పూర్తి కానున్న నేపథ్యంలో ఈయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం

Published : 26 Jun 2022 01:31 IST

నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌

నీతి ఆయోగ్‌ సీఈఓగా 1981 బ్యాచ్‌ యూపీ క్యాడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న అమితాబ్‌కాంత్‌ పదవీకాలం 2022 జూన్‌ 30న పూర్తి కానున్న నేపథ్యంలో ఈయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్లపాటు ఈయన ఈ పదవిలో ఉంటారు.


సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి కె.సజయకు అనువాద రచనలో 2021 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్‌ హిందీలో రచించిన ‘అదృశ్య భారత్‌’ను (నాన్‌ఫిక్షన్‌) సజయ ‘అశుద్ధ భారత్‌’ పేరిట తెలుగులోకి అనువదించారు. అవార్డు కింద ఆమెకు రూ.50వేల నగదు, తామ్రపత్రం అందజేస్తారు. సజయ స్వగ్రామం కృష్ణా జిల్లా పెదముత్తేవి.


కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌గా 1988 బ్యాచ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌కుమార్‌ డేకా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలోఉన్న 1984 అస్సాం క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అరవింద కుమార్‌ పదవీకాలం పూర్తికావడంతో డేకాను నియమిస్తూ నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. కొత్త డైరెక్టర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. డేకా ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఆపరేషన్స్‌ డెస్క్‌ బాధ్యతలు చూస్తున్నారు.


ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి క్షిపణి ‘వర్టికల్‌ లాంఛ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌’ (వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌)ను భారత్‌ 2022, జూన్‌ 24న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ అస్త్రాన్ని ఒడిశాలోని సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌) నుంచి ప్రయోగించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని