కరెంట్‌ అఫైర్స్‌

బ్రిటన్‌కు చెందిన బయో మెడికల్‌ విద్యార్థి ఖుషీ పటేల్‌ ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌-2022’ విజేతగా నిలిచింది. అమెరికాకు చెందిన వైదేహీ డోంగ్రే మొదటి రన్నరప్‌గాను, శ్రుతికా మనే రెండో రన్నరప్‌గాను ఎంపికయ్యారు....

Published : 27 Jun 2022 00:00 IST

మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌-2022 విజేతగా ఖుషీ పటేల్‌

బ్రిటన్‌కు చెందిన బయో మెడికల్‌ విద్యార్థి ఖుషీ పటేల్‌ ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌-2022’ విజేతగా నిలిచింది. అమెరికాకు చెందిన వైదేహీ డోంగ్రే మొదటి రన్నరప్‌గాను, శ్రుతికా మనే రెండో రన్నరప్‌గాను ఎంపికయ్యారు.


ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో జ్యోతి సురేఖ ఆర్చరీలో రెండు పతకాలు సాధించింది. అభిషేక్‌ వర్మతో కలిసి కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో పసిడి నెగ్గింది. ప్రపంచకప్‌ పోటీల్లో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత జోడీగా సురేఖ-అభిషేక్‌ రికార్డుల్లోకెక్కారు. ఫైనల్లో ఈ జంట 152-149 తేడాతో సోఫీ - జీన్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించింది. 37-35తో ఆధిక్యంలో నిలిచి పసిడి గెలిచింది.


బంగ్లాదేశ్‌లో నిర్మించిన అతి పొడవైన వంతెనను ప్రధాని షేక్‌ హసీనా ప్రారంభించారు. పద్మ నదిపై 6.15 కి.మీ.ల పొడవునా ఈ రోడ్‌ - రైలు వంతెనను నాలుగు లేన్లతో నిర్మించారు.


పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఒక అరుదైన మాంసాహార మొక్కను తొలిసారిగా కనుగొన్నారు. ఉత్తరాఖండ్‌ అటవీ శాఖకు చెందిన పరిశోధక బృందం దీన్ని గుర్తించింది. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉన్న మండల్‌ లోయలో ఇది కనిపించినట్లు ‘జర్నల్‌ ఆఫ్‌ జపనీస్‌ బోటనీ’ అనే జర్నల్‌ తెలిపింది. ఈ మొక్క శాస్త్రీయ నామం ‘ఉట్రికులేరియా ఫుర్సెలాటా’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని