ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తును మరొకసారి చూసుకోవడం ఎలా? వెబ్‌సైట్‌లో ఎలాంటి వివరాలు కనిపించడంలేదు....

Published : 27 Jun 2022 00:05 IST

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తును మరొకసారి చూసుకోవడం ఎలా? వెబ్‌సైట్‌లో ఎలాంటి వివరాలు కనిపించడంలేదు. 

- కీర్తి

జ: ఒకసారి దరఖాస్తు సబ్మిట్‌ చేసిన తర్వాత మళ్లీ చూసుకునే అవకాశం ఉండదు.


అమ్మాయి వివాహానంతరం ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తింపజే సేటప్పుడు తండ్రి, భర్త.. ఇద్దరిలో ఎవరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు?

- ఒక అభ్యర్థిని

జ: వివాహానంతరం భర్త ఆదాయాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.


నేను గత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నా పేరు మార్చుకున్నాను. టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌లో అప్‌డేషన్‌ చేస్తుంటే సర్టిఫికెట్లు అడుగుతున్నారు. అవి పాతపేరు మీదే ఉన్నాయి. మిగిలిన కుల, పాన్‌కార్డు, ఆధార్‌ అన్నీ కొత్త పేరుమీద ఉన్నాయి. ఓటీఆర్‌లో సర్టిఫికెట్లను అప్‌డేట్‌ చేయడం ఎలా?

- యశ్వంత్‌

జ: మీరు కుల, పాన్‌కార్డు, ఆధార్‌ అన్నింటినీ పాతపేరు మీదే మార్పించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సర్టిఫికెట్లలో పేరు మార్చుకోవడం వీలుకాదు.


నేను ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు నాగర్‌ కర్నూల్‌లో, అయిదు నుంచి ఏడో తరగతి వరకు వనపర్తిలో చదివాను. ఏ జిల్లాలో స్థానికత పొందుతాను? 

- వేణు

జ: మీరు నాగర్‌ కర్నూల్‌లో స్థానికతను పొందుతారు.

మీ సందేహాలను పోస్ట్‌ చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.

help@eenadupratibha.net


ప్రిపరేషన్‌టెక్నిక్‌

విపత్తు నిర్వహణ ప్రిపరేషన్‌లో భాగంగా ప్రకృతి వైపరీత్యాలతోపాటు మనుషుల వల్ల సంభవించే  అగ్ని ప్రమాదాలు, రసాయన, నీటి కాలుష్యాలు, వాటివల్ల ఏర్పడే నష్టాలను కూడా  చదవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని