Published : 27 Jun 2022 01:31 IST

ల్యాపీస్టాండ్‌ అనువుగా..

చాలామంది విద్యార్థులూ, ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌ కనీస అవసరంగా మారిపోయింది. చదవడం, నోట్సు రాయడం, వివిధ పాజెక్టు పనులను పూర్తిచేయడానికి దీన్ని రోజూ వాడుతూనే ఉంటారు. అయితే మంచం మీదో లేదా కుర్చీల్లో కూర్చునో సాధారణంగా ల్యాపీతో పనులు కానిచ్చేస్తుంటారు. అలాంటప్పుడే మెడ, నడుం నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ.

అలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవడానికి ఇదిగో...ఈ ల్యాపీస్టాండ్‌ ఎంతగానో తోడ్పడుతుంది. దీన్ని మీ ఎత్తుకు అనుగుణంగా అమర్చుకునే వీలుంటుంది. అవసరం లేనప్పుడు మడిచి పదిలపరుచుకోవచ్చు. ఇదే స్టాండ్‌ మీద ట్యాబ్‌ను పెట్టుకునీ పనిచేసుకోవచ్చు కూడా. ఎలాంటి ఇబ్బందీ లేకుండా స్క్రీన్‌ను చూడ్డానికి అనువుగానూ ఉంటుంది.

ఏదైనా వస్తువును కొనే ముందు దాని ధర మనకు అందుబాటులో ఉందో లేదో అని ఆలోచిస్తుంటాం కదా. ఆ సమస్యేమీ లేకుండా ఇది అందుబాటు ధరల్లోనే అంటే.. వెయ్యి నుంచి రెండువేల రూపాయల వరకు ఉంది. అమర్చుకోవడం, పని అయిపోయిన తర్వాత తీసి భద్రపరుచుకోవడమూ తేలికే.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని