ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

గ్రూప్‌-1కి దరఖాస్తు చేసినప్పుడు పోస్ట్‌కోడ్‌ తప్పుగా వేశాను. ఎడిట్‌ ఆప్షన్‌ ఉంటుందా?

Published : 28 Jun 2022 01:32 IST

గ్రూప్‌-1కి దరఖాస్తు చేసినప్పుడు పోస్ట్‌కోడ్‌ తప్పుగా వేశాను. ఎడిట్‌ ఆప్షన్‌ ఉంటుందా?

- మాహీ

జ: ప్రస్తుతం సర్వీస్‌ కమిషన్‌ ఎటువంటి ఎడిట్‌ ఆప్షన్‌ను కల్పించలేదు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కి ముందు రివైజ్డ్‌ ఆప్షన్‌ని ఇవ్వడానికి అవకాశం రావచ్చు. ఆందోళన చెందకండి.


గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌ విభాగానికి పాత సిలబస్‌ ప్రకారం మెటీరియల్‌ చదివితే సరిపోతుందా?

- నరేష్‌

జ: కొత్త సిలబస్‌ ప్రకారమే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు ప్రిపరేషన్‌ సాగించండి.


ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌లతో డిగ్రీ పూర్తి చేశాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 కి దరఖాస్తు చేశాను. నోటిఫికేషన్‌లోని పోస్ట్‌ కోడ్‌ నంబర్‌ 16కి నాకు అర్హత ఉంటుందా?

-సుశాంత్‌

జ: పోస్ట్‌ కోడ్‌ నంబర్‌ 16కి కామర్స్‌/ఎకనామిక్స్‌/ గణితశాస్త్రంలో డిగ్రీ కనీసం సెకండ్‌ క్లాస్‌తో పూర్తి చేసినవారికి అర్హత ఉంది. మీరు డిగ్రీలో ఎకనామిక్స్‌ చేశారు కాబట్టి, ఈ పోస్టుకి అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని