కరెంట్‌ అఫైర్స్‌

జర్మనీలో బవేరియన్‌ ఆల్ప్స్‌ ప్రాంతంలోని షోల్స్‌ ఎల్‌మావ్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు జూన్‌ 26న ప్రారంభమైంది. జూన్‌ 28 వరకు జరిగే ఈ సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితులు,

Updated : 28 Jun 2022 07:01 IST

జర్మనీలో జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభం

జర్మనీలో బవేరియన్‌ ఆల్ప్స్‌ ప్రాంతంలోని షోల్స్‌ ఎల్‌మావ్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు జూన్‌ 26న ప్రారంభమైంది. జూన్‌ 28 వరకు జరిగే ఈ సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ఇంధన సరఫరాలను రక్షించుకోవడానికి ఉన్న మార్గాలపై జీ7  దేశాలు చర్చిస్తాయి. ఈ కూటమిలో అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. 

ప్రభుత్వరంగ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, బీహెచ్‌ఈఎల్‌, గ్యాస్‌ సంస్థ గెయిల్‌తో పాటు ప్రస్తుత మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్‌ వెంకటరామన్‌ కృష్ణమూర్తి (97) చెన్నైలో మరణించారు. పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కార గ్రహీత అయిన ఈయన్ను పబ్లిక్‌ సెక్టార్‌రంగ పితామహుడిగా అభివర్ణిస్తారు.

రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌  తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీలో 41 సార్లు విజేతగా నిలిచిన ముంబయిని ఫైనల్లో ఓడించి ట్రోఫీని అందుకుంది. ఆదిత్య శ్రీవాత్సవ సారథ్యంలోని మధ్యప్రదేశ్‌ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది. శుభమ్‌శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించగా, ముంబయి బ్యాట్స్‌మన్‌ సర్ఫ్‌రాజ్‌ఖాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ దక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని