కరెంట్‌ అఫైర్స్‌

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గుప్తా 1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం సీబీడీటీ బోర్డులో (దర్యాప్తు) సభ్యుడిగా ఉన్నారు.హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌

Published : 29 Jun 2022 00:47 IST

సీబీడీటీ ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గుప్తా 1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం సీబీడీటీ బోర్డులో (దర్యాప్తు) సభ్యుడిగా ఉన్నారు.
హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ) డైరెక్టర్‌గా 1987 బ్యాచ్‌ బిహార్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి ఏఎస్‌ రాజన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌    బ్యూరోలో స్పెషల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ధ్రువ స్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు, బెంగళూరుకు చెందిన దిగంతర రిసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రోబస్ట్‌ ఇంటిగ్రేటింగ్‌ ప్రోటాన్‌ ఫ్ల్యూయన్స్‌ మీటర్‌ (రోబి)కు ఇన్‌-స్పేస్‌ (ఇండియన్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌) గుర్తింపు లభించింది.
మాదక ద్రవ్యాలు-నేరాలపై ‘ప్రపంచ మాదకద్రవ్య నివేదిక 2022’ను ఐరాస విడుదల చేసింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా 15-64 ఏళ్ల మధ్య వయసు వారిలో 28.4 కోట్ల మంది ప్రజలు  మాదకద్రవ్యాలను వినియోగించారని ఈ నివేదిక తెలిపింది.
మానవ మెదడులోని నరాల వ్యవస్థను క్షుణ్ణంగా సమీక్షించే జీపీయూ ఆధారిత మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ను బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌) రూపొందించింది.
పర్వత ప్రాంతాల్లో మొక్కలకు ప్రయోజనం కల్పించే వినూత్న వ్యవస్థను కాన్పుర్‌ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మొక్కల వేర్లను వేడి చేయడానికి సౌరశక్తి సాయంతో పనిచేసే హీటింగ్‌ వ్యవస్థను వీరు రూపొందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని