కరెంట్‌ అఫైర్స్‌

దేశీయంగా అభివృద్ధి చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని కేకే రేంజ్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు, సైనికాధికారులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

Published : 30 Jun 2022 01:48 IST

ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని కేకే రేంజ్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు, సైనికాధికారులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం   టీహబ్‌-2ను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో కలిసి  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు.

రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత సభ్యుల్లో 31 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నట్లు జాతీయ ఎన్నికల నిఘా సంస్థ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌’ (ఏడీఆర్‌) ఒక నివేదికలో పేర్కొంది.

రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ బాధ్యతలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఈఓ ముకేశ్‌ అంబానీ తన పెద్ద కుమారుడైన ఆకాశ్‌ అంబానీకి అప్పగించారు.

వ్యాపార దిగ్గజం, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత పల్లోంజీ మిస్త్రీ (93) దక్షిణ ముంబయిలో మరణించారు. 100 బిలియన్‌ డాలర్లకు పైగా నికర సంపద కలిగిన టాటా గ్రూప్‌లో 18.37 శాతం వాటాతో పల్లోంజీ మిస్త్రీ అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని