గెయిల్‌ సీఎండీగా సందీప్‌ కుమార్‌ గుప్తా

గెయిల్‌ ఇండియా కొత్త ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సందీప్‌ కుమార్‌ గుప్తాను (56) ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో (ఐఓసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆగస్టు 31న పదవీ విరమణ...

Published : 01 Jul 2022 00:08 IST

గెయిల్‌ ఇండియా కొత్త ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సందీప్‌ కుమార్‌ గుప్తాను (56) ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో (ఐఓసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్న గెయిల్‌ ప్రస్తుత సీఎండీ మనోజ్‌ జైన్‌ స్థానాన్ని సందీప్‌ భర్తీ చేయనున్నారు.


సీనియర్‌ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌ (91)ను భారత అటార్నీ జనరల్‌(ఏజీ)గా మరో మూడు నెలలు కొనసాగిస్తున్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. జూన్‌ 29న ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్‌ ఎక్స్‌పెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌ (హెచ్‌ఈఏటీ) విమానం ‘అభ్యాస్‌’ గగనతల పరీక్షను డీఆర్‌డీవో విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరం చాందీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్‌)లో దీన్ని పరీక్షించారు. క్షిపణుల గగనతల పరీక్షల్లో లక్ష్యంగా వినియోగించడానికి వీలుగా డీఆర్‌డీవోలోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ విభాగం అభ్యాస్‌ను రూపొందించింది.


ఈ ఏడాది జాతీయ క్రీడలను సెప్టెంబరు - అక్టోబరు మధ్యలో గుజరాత్‌లో నిర్వహించనున్నట్లు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్‌ మెహతా ప్రకటించారు. వివిధ కారణాల వల్ల ఈ క్రీడలు వాయిదా పడుతూ వస్తున్నాయి.


దేశంలోని అంకుర సంస్థల్లో వందకు పైగా త్వరలోనే యూనికార్న్‌ స్థాయికి చేరనున్నట్లు హ్యూరన్‌ పరిశోధన సంస్థ సమీక్షలో వెల్లడైంది. ఆస్క్‌ వెల్త్‌, హ్యూరన్‌ ఇండియా ఫ్యూచర్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ - 2022ను బెంగళూరులో విడుదల చేశారు. అమెరికా, చైనాల తర్వాత అత్యధిక యూనికార్న్‌లు ఉన్న దేశంగా భారత్‌ ఆవిర్భవించనున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఒక బిలియన్‌ డాలర్ల (రూ.7,892 కోట్ల) విలువకు చేరుకున్న సంస్థను యూనికార్న్‌గా పరిగణిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని