కరెంట్‌ అఫైర్స్‌

ఒలింపిక్‌ జావెలిన్‌ త్రో స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రా స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు విసిరి రజతం సాధించాడు. డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌కు ఇదే తొలి పతకం.

Published : 02 Jul 2022 00:20 IST

నీరజ్‌ చోప్రా జాతీయ రికార్డు

ఒలింపిక్‌ జావెలిన్‌ త్రో స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రా స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు విసిరి రజతం సాధించాడు. డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌కు ఇదే తొలి పతకం.


మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొత్తంగా 170 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకి ఉందని చెప్పారు.


పీఎస్‌ఎల్‌వీ-సి53 వాహకనౌకను ఇస్రో తిరుపతిజిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఇది సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. మొదటిసారిగా పోలార్‌ సాటిలైట్‌ 4 (నాలుగోదశ)ను భూమి చుట్టూ తిరుగుతూ ఉండేలా నూతన సాంకేతికతతో శాస్త్రవేత్తలు రూపొందించారు.


ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 56 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా 2050 నాటికి ఆ సంఖ్య 68 శాతానికి (220 కోట్లకు) చేరనుంది. భారత్‌లో ప్రస్తుతం 48 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పరచుకోగా 2035 నాటికి ఆ సంఖ్య 67 కోట్ల 50 లక్షలకు చేరనుందని ఐక్యరాజ్య సమితి హాబిటాట్‌ వరల్డ్‌ సిటీస్‌ రిపోర్ట్‌ - 2022 వెల్లడించింది.


కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘బిజినెస్‌ రిఫామ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2020’ నివేదిక ప్రకారం కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నిర్దేశించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలులో ఏడు రాష్ట్రాలు 90%కి పైగా మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని