కరెంట్‌ అఫైర్స్‌

తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త జాతీయ స్థాయి నేషనల్‌ జియోసైన్స్‌ అవార్డ్డుకు ఎంపికయ్యారు. మౌలిక భూభౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన ద్రోణ శ్రీనివాస శర్మ హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశో

Published : 03 Jul 2022 02:32 IST

తెలంగాణ శాస్త్రవేత్తకు జాతీయ అవార్డు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త జాతీయ స్థాయి నేషనల్‌ జియోసైన్స్‌ అవార్డ్డుకు ఎంపికయ్యారు. మౌలిక భూభౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన ద్రోణ శ్రీనివాస శర్మ హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)లో సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు.


హైదరాబాద్‌కు చెందిన యువ వైద్యుడు డాక్టర్‌ సాయిరాం పిల్లారిశెట్టికి ప్రతిష్ఠాత్మక డయానా పురస్కారం దక్కింది. ఈయన ఇటీవలే  బ్రిటన్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు.


ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో డైరెక్టర్‌ పోస్టులకు అర్హులను ఎంపిక చేసే బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరోను (బీబీబీ) ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ)గా ప్రభుత్వం మార్పు చేసింది.


జీఎస్టీ ద్వారా జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,44,616 కోట్లు వసూలయ్యాయి. 2021 జూన్‌తో పోలిస్తే ఇది 56% అధికమని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వసూలైన రూ.1,67,540 కోట్ల తర్వాత ఒక నెలలో వసూలైన గరిష్ఠ మొత్తం ఇదేనని ఆర్థిక శాఖ పేర్కొంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని