ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో నెగిటివ్‌ మార్కులు ఉంటాయా?

Published : 04 Jul 2022 00:56 IST

* టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో నెగిటివ్‌ మార్కులు ఉంటాయా? - ఒక అభ్యర్థి

జ: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో నెగిటివ్‌ మార్కులు ఉండవు.


* నేను 1998లో జన్మించినట్లు స్కూల్‌ బోనఫైడ్‌లో తప్పుగా నమోదైంది. ఆ ప్రాతిపదికనే పదో తరగతి మెమో జారీ అయ్యింది. దీని కారణంగా ఉద్యోగాల్లో నష్టపోతున్నాను. ఏదైనా పరిష్కార మార్గం చూపించండి. - ఒక అభ్యర్థి

జ: పదోతరగతి సర్టిఫికెట్‌లో జారీ చేసిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఇక చేసేదేమి ఉండదు.


* నాపై 2015లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వాయిదాలకు కోర్టుకి వెళుతున్నాను. ఒకవేళ ఉద్యోగం వస్తే ఏదైనా సమస్య ఉంటుందా? - చంద్రకాంత్‌

జ: కోర్టు తీర్పును అనుసరించి చర్యలు ఉంటాయి.


* మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. నెలకు రూ.80 వేల జీతం వస్తుంది. మా కులం బీసీ-బి. నేను ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏ కేటగిరీ కిందికి వస్తాను? జనరల్‌ కేటగిరీ/ఓబీసీ? - సిరి

జ: క్రీమిలేయర్‌ పరిధిలోకి వస్తారు. అయినప్పటికీ ఒకసారి సంబంధిత తహసీల్దార్‌ను సంప్రదిస్తే మీకు స్పష్టత వస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని