కరెంట్‌ అఫైర్స్‌

కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా నాయకనహట్టి దగ్గర ఉన్న డీఆర్‌డీవో ఏరోనాటికల్‌ టెస్టు రేంజ్‌లో నిర్వహించిన రిమోట్‌ కంట్రోల్డ్‌ మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతమైంది. ఈ విమానాన్ని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు.

Published : 04 Jul 2022 00:56 IST

మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం

కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా నాయకనహట్టి దగ్గర ఉన్న డీఆర్‌డీవో ఏరోనాటికల్‌ టెస్టు రేంజ్‌లో నిర్వహించిన రిమోట్‌ కంట్రోల్డ్‌ మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతమైంది. ఈ విమానాన్ని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు.


అమెరికా రక్షణ శాఖ కొత్తగా ఏడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించింది. లాస్‌ ఏంజెలెస్‌లోని మొహావీ ఎడారిలో ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి వర్జిన్‌ ఆర్బిట్‌ రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఈ రాకెట్‌ను మొదట ప్రత్యేక బోయింగ్‌ 747 విమానం నింగిలోకి తీసుకెళ్లింది. అక్కడి నుంచి అది భూ కక్ష్యలోకి దూసుకెళ్లింది.


టీమ్‌ఇండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ సాహా, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) మధ్య 15 ఏళ్ల బంధానికి తెరపడింది. బెంగాల్‌ జట్టును వీడిన అతనికి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) క్యాబ్‌ జారీ చేసింది. 2007లో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బెంగాల్‌ తరపున అరంగేట్రం చేసిన సాహా.. 122 ఫస్ట్‌క్లాస్‌, 102 లిస్ట్‌- ఏ మ్యాచ్‌లాడాడు.


స్వీడన్‌ పోల్‌ వాల్ట్‌ అథ్లెట్‌ ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ ఇదివరకు తన పేరిటే ఉన్న ఔట్‌డోర్‌ ప్రపంచ రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌ మీట్‌లో అతను 6.16 మీటర్ల (20 అడుగుల 2.5 అంగుళాలు) ఎత్తు దూకి ఛాంపియన్‌గా నిలిచాడు.


ఇజ్రాయెల్‌లో బెంజమిన్‌ నెతన్యాహును దేశాధ్యక్ష పీఠం నుంచి దించేయడమే లక్ష్యంగా గత ఏడాది ఏర్పడిన సంకీర్ణ సర్కారు 2022 జూన్‌ 30న కూలిపోయింది. పార్లమెంటు ‘నెస్సెట్‌’ రద్దయింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని