Published : 05 Jul 2022 00:35 IST

కరెంట్‌ అఫైర్స్‌

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌గా సినీశెట్టి

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ (2022) టైటిల్‌ను కర్ణాటకకు చెందిన సినీశెట్టి గెలుచుకున్నారు. ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫైనల్‌ జరిగింది. ఈ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన రూబల్‌ శెఖావత్‌ మొదటి రన్నరప్‌గా నిలవగా, ఉత్తర్‌ప్రదేశ్‌ యువతి షినాటా చౌహాన్‌ ద్వితీయ రన్నరప్‌గా ఎంపికయ్యారు.


వింబుల్డన్‌ సెంటల్‌ కోర్టుకు 2022 జులై 3 నాటికి వందేళ్లు పూర్తయ్యాయి. ఈ కోర్టును 1922లో ప్రారంభించారు. ఆరంభంలో 9,989గా ఉన్న సీట్ల సంఖ్యను 14,974కు పెంచారు. 2009లో ముడుచుకునే పైకప్పు ఏర్పాటు చేశారు.


అమెరికాలో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందినవారు ఎక్కువగా ఉన్న తొలి 5 దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. అత్యధికంగా మెక్సికో నుంచి 24,508 మంది ఉండగా భారత్‌కు చెందిన వారు 12,928 మంది ఉన్నారు. ఫిలిప్పీన్స్‌ (11,316), క్యూబా (10,689), డొమినికన్‌ రిపబ్లిక్‌ (7,046)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా అంతర్గత భద్రతా విభాగం గణాంకాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో మొత్తం 1,97,148 మందికి పౌరసత్వం ఇవ్వగా ఈ 5 దేశాలకు చెందినవారే 34% ఉన్నారు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని