చదువరులకు ముంబయి బెస్ట్‌!

విద్యార్థులకు మన దేశంలో ఉన్న అన్ని నగరాల్లోకెల్లా ముంబయి చక్కగా సరిపోతుందని తేలింది. ‘గ్లోబల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ క్యూఎస్‌’ అనే అంతర్జాతీయ సంస్థ ఈ విషయం తెలిపింది.. ఏటా ఈ సంస్థ వివిధ అంశాలపై సర్వే చేసి ర్యాంకులు ఇస్తూ ఉంటుంది.

Published : 05 Jul 2022 01:17 IST

విద్యార్థులకు మన దేశంలో ఉన్న అన్ని నగరాల్లోకెల్లా ముంబయి చక్కగా సరిపోతుందని తేలింది. ‘గ్లోబల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ క్యూఎస్‌’ అనే అంతర్జాతీయ సంస్థ ఈ విషయం తెలిపింది.. ఏటా ఈ సంస్థ వివిధ అంశాలపై సర్వే చేసి ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. తాజాగా 2022-23 ఏడాదిలో... చదువుకునే వారికి ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన నగరం ఏదనే అంశంపై సర్వే చేసింది. ఇందులో మన దేశంలో ముంబయి (అంతర్జాతీయ ర్యాంకు 103) తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా బెంగళూరు (114), చెన్నై(125), దిల్లీ(129) ఉన్నాయి. అయితే ఈ జాబితాలో టాప్‌ 100లో మన దేశం నుంచి ఒక్కనగరం కూడా చోటు దక్కించుకోలేకపోయింది.

* నూటికి నూరు మార్కులు సాధించి లండన్‌ నగరం ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. టాప్‌ 10 నగరాలుగా లండన్‌తోపాటు మ్యూనిచ్‌ (జర్మనీ), సియోల్‌ (సౌత్‌కొరియా), జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌), మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా), బెర్లిన్‌ (జర్మనీ), టోక్యో (జపాన్‌), పారిస్‌ (ఫ్రాన్స్‌), సిడ్నీ (ఆస్ట్రేలియా), ఈడెన్‌బర్గ్‌ (యునైటెడ్‌ కింగ్‌డమ్‌) వరుసగా నిలిచాయి.

* ఈ సర్వే కోసం విద్యార్థుల కోణంలో వివిధ అంశాలను ఈ సంస్థ పరిశీలించింది. ఖర్చులు అందుబాటులో ఉండటం, విద్యానాణ్యత, భద్రత, బ్రాండ్‌ ఇమేజ్‌ లాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని