సరిగ్గా కూర్చుంటున్నారా?
రోజూ కాలేజీకి వెళ్లే విద్యార్థులు గంటలతరబడి కూర్చోవాల్సి వస్తుంది. పోటీ పరీక్షలకు చదివే అభ్యర్థులైతే ఇక చెప్పాల్సిన పనేలేదు, పుస్తకాల ముందే రోజు గడిచిపోతుంటుంది. మరి ఇంతింతసేపు కుర్చీకి అతుక్కుపోతున్నప్పుడు.. మీరు సరిగ్గా కూర్చుంటున్నారో లేదో గమనిస్తున్నారా?
* సరిగ్గా కూర్చోవడం వల్ల శరీరానికి, మెదడుకు చాలా లాభాలున్నాయి. స్థిరమైన భంగిమ వల్ల వెన్నెముక, మెడ, భుజాలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. చక్కని ఏకాగ్రత కుదిరేందుకు తోడ్పడి చదువుతున్న అంశాలపై దృష్టి పెరుగుతుంది. త్వరగా అలసిపోకుండా చదవగలుగుతాం.
* అలా కాకుండా ఎలా పడితే అలా కూర్చోవడం వల్ల ఒళ్లంతా భారంగా అనిపిస్తుంది. తిమ్మిర్లు మొదలవుతాయి. పఠనంపై ఆసక్తి తగ్గుతుంది. కండరాలకు అనవసర శ్రమ కలుగుతుంది. దీనివల్ల ఒక్కోసారి తలనొప్పి కూడా రావొచ్చు.
* కూర్చునేటప్పుడు మరీ ముందుకు వంగకుండా, అలాగే మరీ వెనక్కి జారిపోకుండా వెన్ను నిటారుగా ఉంచాలి. కుర్చీ వెనుకభాగం మనకు దన్నుగా ఉండాలి.
* పాదాలు నేలకు తాకేలా ఉంచుతూ మోకాళ్లు కుర్చీకి సమాంతరంగా ఉండేలా కూర్చోవాలి. మరీ ముందుకు పడిపోయినట్లు, లేదా లోతులోకి కూరుకుపోయినట్టు ఉండకూడదు.
* చేతులకు బల్ల ఊతంగా ఉండాలి. వాటిని గాల్లో ఉంచడం మంచిది కాదు.
* కొన్నిసార్లు చదివేటప్పుడు ల్యాప్‌ట్యాప్ లేదా కంప్యూటర్ను కూడా వినియోగించాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో కీబోర్డు, మౌస్, స్క్రీన్‌ను మన ఎత్తుకు తగినట్టుగా మార్చుకోవాలి.
* చదివేటప్పుడు ఎక్కువగా ఉపయోగించే వస్తువులను.. అంటే పెన్, హైలైటర్, అవసరమైన పుస్తకాలన్నింటినీ పక్కనే ఉంచుకోవాలి. అందువల్ల అస్తమానూ చేతులు చాచి భుజాలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Bangla Fuel Crisis: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న పెట్రోల్ ధరలు.. ఒకేసారి 52శాతం పెరుగుదల
-
Movies News
Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!
-
Sports News
CWG 2022: భారత్‌కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..
-
India News
Kejriwal: మంత్రులకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా.. సామాన్యులకు ఇస్తే తప్పేంటి..?
-
India News
UP: మహిళపై దాడి.. భాజపా నేతకు యోగి సర్కార్ ఝలక్..!
-
General News
Picnic: ఒక్కసారిగా వరద.. కొట్టుకుపోయిన 14 కార్లు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్