కష్టపడి చదివాక...

ఆకాశంలోని నిండు చందమామను చూస్తే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాంటి అందాల జాబిల్లిని మన గదిలోనే బంధించుకునే మార్గమూ ఉంది. అదెలాగంటే.. ఈ 3డీ మూన్‌లైట్‌ ల్యాంప్‌ను గదిలో అమర్చుకుంటే చాలు...

Updated : 06 Jul 2022 05:55 IST

కాశంలోని నిండు చందమామను చూస్తే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాంటి అందాల జాబిల్లిని మన గదిలోనే బంధించుకునే మార్గమూ ఉంది. అదెలాగంటే.. ఈ 3డీ మూన్‌లైట్‌ ల్యాంప్‌ను గదిలో అమర్చుకుంటే చాలు... ఎక్కడో దూరాన ఉన్న చందమామ కాస్తా నేరుగా మన గదిలోకే వచ్చేసిన అనుభూతి!  

అప్పటివరకూ కష్టపడి చదువుకుని అలసిపోయిన విద్యార్థులు దీని కాంతిలో ఆదమరిచి హాయిగా నిద్రపోవచ్చు. ఈ లైటుతోపాటుగా చెక్క స్టాండు, యూఎస్‌బీ వైరూ వస్తాయి. లైటును సున్నితంగా ఒకసారి తడితే చాలు, ఆన్‌ అవుతుంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా ఏడు రంగుల్లోకి మారుతుంది. రీఛార్జ్‌ చేసుకుని వాడాలి. అందుబాటు ధరల్లోనే ఉండే ఈ బుల్లి జాబిలమ్మను ఈకామర్స్‌ సైట్ల నుంచి తెప్పించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు