ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

గ్రూప్‌-2 నా లక్ష్యం. కానీ, గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు గ్రూప్‌-4 సిలబస్‌పై శ్రద్ధ పెట్టాలా లేదా గ్రూప్‌-2 కి ప్రిపేర్‌ కావాలో అర్థం కావడం లేదు? పరిష్కార మార్గం చూపించండి.

Published : 07 Jul 2022 00:08 IST

గ్రూప్‌-2 నా లక్ష్యం. కానీ, గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు గ్రూప్‌-4 సిలబస్‌పై శ్రద్ధ పెట్టాలా లేదా గ్రూప్‌-2 కి ప్రిపేర్‌ కావాలో అర్థం కావడం లేదు? పరిష్కార మార్గం చూపించండి.

- సోమా

జ: గ్రూప్‌-2 ప్రిపరేషన్‌ గ్రూప్‌-4కి కూడా సరిపోతుంది. అయితే గ్రూప్‌-4కి అదనంగా సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ను చదవాలి. మీరు కంగారుపడకుండా రెండింటికీ ఏకకాలంలో ప్రిపరేషన్‌ను కొనసాగించండి.


2017లో ఒక భూమి విషయంలో నాపై ఐపీసీ 306, 447 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తర్వాత లోక్‌ అదాలత్‌లో ఆ కేసును కొట్టివేశారు. గ్రూప్‌-1 దరఖాస్తులో పొరపాటున కేసు విషయంలో నేను దోషిని అని నింపాను. దీనివల్ల గ్రూప్‌-1 ఉద్యోగ సాధనకు ఏదైనా అవరోధం ఏర్పడుతుందా?

- రతన్‌

జ: ఎలాంటి అవరోధం ఉండదు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో లోక్‌ అదాలత్‌ ఇచ్చిన తీర్పు కాపీని సమర్పించాల్సి ఉంటుంది.


నేను ఒకటి నుంచి అయిదో తరగతి వరకు గద్వాల్‌లో; ఆరు నుంచి పదో తరగతి వరకు నాగర్‌కర్నూల్‌లో చదివాను. టీఎస్‌పీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏ జిల్లాలో స్థానికత పొందుతాను?

- రాజేష్‌

జ: మీరు గద్వాల్‌ జిల్లా స్థానికతను పొందుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని