కరెంట్‌ అఫైర్స్‌

పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటు చేసిన అశోక చక్రం, నాలుగు సింహాల అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ జాతీయ చిహ్నం 9,500 కేజీల బరువు, 6.5 మీటర్ల ఎత్తు ఉంది. 

Published : 13 Jul 2022 00:14 IST

అతిపెద్ద జాతీయ చిహ్నం ఆవిష్కరణ

పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటు చేసిన అశోక చక్రం, నాలుగు సింహాల అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ జాతీయ చిహ్నం 9,500 కేజీల బరువు, 6.5 మీటర్ల ఎత్తు ఉంది. 


భారత యువ షూటర్‌ అర్జున్‌ బబుతా(23) ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో పసిడి గెలిచాడు. పురుషుల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో 17-9తో టోక్యో ఒలింపిక్స్‌ రజత విజేత లుకాస్‌ కొజెనీస్కీ (అమెరికా)ని ఓడించాడు. సీనియర్‌ విభాగంలో అర్జున్‌కు ఇదే తొలి స్వర్ణం. 2016 జూనియర్‌ ప్రపంచకప్‌లో అతడు బంగారు పతకం నెగ్గాడు. ఈ పంజాబ్‌ షూటర్‌ తాజా ప్రపంచకప్‌లో ర్యాంకింగ్‌ రౌండ్లో 261.1 స్కోరుతో పసిడి పోరుకు అర్హత సాధించాడు. మరో భారత షూటర్‌ పార్థ్‌ మఖీజా (258.1) నాలుగో స్థానంలో నిలిచాడు.


జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) జ్యుడీషియల్‌ మెంబర్‌గా మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పుష్పా సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


వ్యర్థ జలాల్లో కరోనా వైరస్‌కు సంబంధించిన ఆందోళనకర వేరియంట్లను గుర్తించే కొత్త సాధనాన్ని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, స్క్రిప్స్‌ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్‌ సహా ఆందోళనకర వేరియంట్లను వైద్య పరీక్షల్లో గుర్తించడానికి 14 రోజుల ముందే ఇది వైరస్‌ జాడను పట్టించేస్తుంది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని