ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

పదో తరగతి తర్వాత కొంత గ్యాప్‌ వచ్చింది. తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఒక సంవత్సరంలో ఇంటర్‌ పూర్తి చేశాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4కి ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ ఇంటర్‌తో దరఖాస్తు చేసుకోవచ్చా?

Published : 14 Jul 2022 00:40 IST

పదో తరగతి తర్వాత కొంత గ్యాప్‌ వచ్చింది. తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఒక సంవత్సరంలో ఇంటర్‌ పూర్తి చేశాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4కి ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ ఇంటర్‌తో దరఖాస్తు చేసుకోవచ్చా?

- క్రిష్‌

జ: మీరు ఇంటర్‌ కనీస అర్హతగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంకోచించకుండా అన్నింటికీ బాగా ప్రిపేర్‌ అవ్వండి.


టెట్‌ ఫలితాల్లో అర్హత లభించింది. అయితే టెట్‌ హాల్‌ టికెట్‌లో ఉన్న ఇంటి పేరు సర్టిఫికెట్‌లో ఉన్న విధంగా కాకుండా ఆధార్‌లో ఉన్నట్లు వచ్చింది. భవిష్యత్తులో ఈ టెట్‌ మార్కులను డీఎస్సీకి పరిగణనలోకి తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా?

- గోపు

జ: ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. కానీ మీరు ఇంటిపేరును సర్టిఫికెట్‌లో ఉన్న విధంగానే ఆధార్‌ సహా అన్నింటిలోనూ మార్చుకోవడం మంచిది.


నా పాఠశాల విద్యాభ్యాసమంతా మేడ్చల్‌ జిల్లాలో పూర్తి చేశాను. టీఎస్‌ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసినప్పుడు స్కూలింగ్‌ వివరాలలో పొరబాటున రంగారెడ్డి జిల్లా అని నింపాను. ఎడిట్‌ అవకాశం ఉందా?

- కిరణ్‌

జ: ప్రస్తుతం ఎడిట్‌ చేసుకునే అవకాశం లేదు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో సరిచేసుకోండి.

help@eenadupratibha.net


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని