కరెంట్‌ అఫైర్స్‌

విశ్వం గుట్టుమట్లను విప్పడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగించిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) తీసిన తొలి చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విడుదల చేశారు. 1380 కోట్ల సంవత్సరాల కిందట ఒక మహా

Published : 14 Jul 2022 00:53 IST

జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు తొలి చిత్రం విడుదల

విశ్వం గుట్టుమట్లను విప్పడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగించిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) తీసిన తొలి చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విడుదల చేశారు. 1380 కోట్ల సంవత్సరాల కిందట ఒక మహా విస్ఫోటం (బిగ్‌ బ్యాంగ్‌) ద్వారా విశ్వం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలను తెలుసుకునేందుకు నాసా ఈ టెలిస్కోపును రూపొందించింది.


టైమ్‌ మ్యాగజీన్‌ వెల్లడించిన ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో అహ్మదాబాద్‌ నగరం, కేరళ రాష్ట్రం చోటు దక్కించుకున్నాయి.


ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో 653 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జులై 12న ప్రారంభించారు. దీంతో పాటు రూ. 16,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి బిహార్‌ అసెంబ్లీ శత జయంత్యుత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. బిహార్‌ అసెంబ్లీని సందర్శించిన తొలి ప్రధాని మోదీయే.


గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణే లక్ష్యంగా తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన ‘క్వాడ్రివాలెంట్‌ హ్యూమన్‌ పాపిలోమావైరస్‌ వ్యాక్సిన్‌ (క్యూహెచ్‌పీవీ)’ను ఉత్పత్తి చేసి విపణిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకుగాను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)కు ‘డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)’ అనుమతి మంజూరు చేసింది. ‘సెర్వావాక్‌’గా ఈ టీకాను పిలవనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని