కరెంట్‌ అఫైర్స్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ పతకాల పట్టికలో అగ్రస్థానం సాధించింది. 3 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం సహా మొత్తం 8 పతకాలు నెగ్గింది.

Published : 16 Jul 2022 00:39 IST

షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు అగ్రస్థానం

ఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ పతకాల పట్టికలో అగ్రస్థానం సాధించింది. 3 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం సహా మొత్తం 8 పతకాలు నెగ్గింది.


భారత రక్షణ శాఖకు చెందిన డీఆర్‌డీఓ (డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) వినూత్న 9 ఎంఎం పిస్టల్‌ను అభివృద్ధి చేయగా, దీన్ని హైదరాబాద్‌కు చెందిన లోకేష్‌ మెషిన్స్‌ తయారు చేసింది. దీని బరువు 2 కిలోలు.  దిల్లీలో జరిగిన 7వ అంతర్జాతీయ పోలీసు ఎగ్జిబిషన్‌లో దీన్ని ప్రదర్శించారు.


భారత్‌, ఇజ్రాయెల్‌, అమెరికా, యూఏఈ కూటమి ‘ఐ2యూ2’ తొలి సమావేశం 2022 జులై 14న వర్చువల్‌ విధానంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని యాయిర్‌ లాపిడ్‌, యూఏఈ పాలకుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ పాల్గొన్నారు. నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో సంయుక్త పెట్టుబడులపై చర్చించారు.


రియల్‌ ఎస్టేట్‌ (రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) యాక్ట్‌ 2016 అమలు కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన కేంద్ర సలహా మండలిలో తెలంగాణకు స్థానం దక్కింది. ఈ మండలిలో పది రాష్ట్రాల సభ్యులను ప్రతి మూడేళ్లకోసారి రొటేషన్‌ ప్రాతిపదికన మారుస్తూ ఉంటారు.


అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఔషధ అణువుల గుర్తింపునకు సరికొత్త కృత్రిమ మేధ నమూనాను ఆవిష్కరించారు. ‘ఈక్విబైండ్‌’గా దానికి నామకరణం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన ‘క్విక్‌ వినా2-డబ్ల్యూ’ అనే గణాంక నమూనా కంటే ఇది 1,200 రెట్లు వేగంగా పనిచేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని