ఫిజిక్స్‌ ప్రాక్టీస్‌ బిట్లు

విద్యుదయస్కాంత ప్రేరణను కనుక్కున్నవారు? 1) గాస్‌ 2) ఫారడే  3) ఓమ్‌ 4) ఆంపియర్‌

Published : 17 Jul 2022 02:29 IST

1. విద్యుదయస్కాంత ప్రేరణను కనుక్కున్నవారు?
1) గాస్‌ 2) ఫారడే  3) ఓమ్‌ 4) ఆంపియర్‌
2. నానోమీటర్‌ విలువ?  
1) 10-9 మీ.2) 10-6 మీ.3) 10-10 మీ.4) 10-3 మీ.
3. కిందివాటిలో యాంత్రిక తరంగం ఏది?
1) రేడియో తరంగాలు 2) శ్రీ  కిరణాలు  
3) కాంతి తరంగాలు 4) ధ్వని తరంగాలు
4. ఏ రకమైన కాంతి లోహ ఉపరితలాలపై పతనం చెందితే ఎలక్ట్రాన్‌లు వెలువడే అవకాశం ఉంది?
1) అల్ప తరంగదైర్ఘ్యం 2) అధిక తరంగదైర్ఘ్యం  
3) తక్కువ వేగం 4) తక్కువ పౌనఃపున్యం
5. కెపాసిటెన్స్‌కు ప్రమాణం
1) కూలూంబ్‌ 2) గాస్‌ 3) హెన్రీ 4) ఫారడ్‌
6. దృశా తంతువుల్లో సమాచారాన్ని తీసుకుని వెళ్లేవి?
1) కాంతి కిరణాలు 2) ధ్వని తరంగాలు
3) ఆల్ఫా కిరణాలు 4) కాస్మిక్‌ కిరణాలు
7. అధిక ఉష్ణోగ్రతలను కొలిచే పైరోమీటర్‌ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
1) ఉష్ణ వ్యాకోచం 2) న్యూటన్‌ శీతలీకరణ నియమం
3) సీబెక్‌ ఫలితం 4) స్టీఫెన్‌ నియమం
8. కిందివాటిలో దేనికి సగటు బంధన శక్తి
అత్యధికం?
1) హీలియం       2) ఇనుము
3) యురేనియం 4) థోరియం
9. భారానికి ళీ.ఖి. ప్రమాణం ఏది?
1) కిలోగ్రామ్‌ 2) క్వింటాల్‌ 3) టన్ను 4) న్యూటన్‌
10. సూర్యుడి నుంచి వేడి భూమిని చేరే పద్ధతి?
1) ఉష్ణ వహనం    2) ఉష్ణ సంవహనం  
3) వికిరణం 4) అన్నీ


సమాధానాలు : 1-2; 2-1; 3-4; 4-1; 5-4; 6-1; 7-4; 8-2; 9-4; 10-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని