ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నాకు టెట్‌లో 67 మార్కులు వచ్చాయి. పీహెచ్‌ అభ్యర్థిని. వినికిడి లోపం (87 శాతం) ఉంది. నాకు డీఎస్సీ రాయడానికి అర్హత ఉంటుందా?

Published : 17 Jul 2022 02:29 IST


నాకు టెట్‌లో 67 మార్కులు వచ్చాయి. పీహెచ్‌ అభ్యర్థిని. వినికిడి లోపం (87 శాతం) ఉంది. నాకు డీఎస్సీ రాయడానికి అర్హత ఉంటుందా?

- పొట్లపల్లి

జ: మీకు డీఎస్సీ రాయడానికి అర్హత ఉంటుంది.


నేను ఒకటి నుంచి అయిదో తరగతి వరకు హైదరాబాద్‌లో, ఆరు నుంచి పది వరకు రంగారెడ్డి జిల్లాలో చదివాను. ఆ తర్వాత డిప్లొమా హైదరాబాద్‌లో చేసి, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాను. నాకు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయడానికి ఏ జిల్లా స్థానికత వర్తిస్తుంది?       

  - ఒక అభ్యర్థి

జ: మీరు హైదరాబాద్‌లో స్థానికత పొందుతారు.


నేను ఎస్‌ఐ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నాను. డిగ్రీ, ఇంటర్‌ దూరవిద్యలో చేశాను. ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థిని. అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాయడానికి అర్హత ఉంటుందా?

- నవ్య చరగొండ్ల

జ: మీకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాయడానికి కచ్చితంగా అర్హత ఉంది. ఏ సంకోచం లేకుండా బాగా ప్రిపేర్‌ అవ్వండి.


నేను హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్ల ట్రాఫిక్‌ పోలీస్‌ చలానా వేశారు. ప్రభుత్వ ఉద్యోగ సాధనలో ఏదైనా సమస్య ఎదురవుతుందా?
               

  - నర్మద

జ: ఎలాంటి సమస్య ఉండదు. పరీక్షలకు దరఖాస్తు చేసి ఉంటే బాగా చదువుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని