ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను తెలంగాణ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుకు దరఖాస్తు చేశాను. నోటిఫికేషన్‌లో రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు

Published : 20 Jul 2022 02:38 IST

తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష పత్రం తెలుగు, ఇంగ్లిష్‌ రెండు భాషల్లోనూ ఉంటుందా? 

 - సోమనాథ్‌

జ: అవును. రెండు భాషల్లోనూ పరీక్ష పత్రం ఇస్తారు.
నేను తెలంగాణ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుకు దరఖాస్తు చేశాను. నోటిఫికేషన్‌లో రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు అయ్యే హెచ్‌ఎంవీ లైసెన్స్‌ను కలిగి ఉండాలని పేర్కొన్నారు. 


 2020 ఏప్రిల్‌లో నా లైసెన్స్‌ గడువు ముగిసింది. కరోనా వల్ల లైసెన్స్‌ను కొంత ఆలస్యంగా అదే సంవత్సరం అక్టోబరులో పొందాను. ఈ పోస్టుకు నాకు అర్హత ఉంటుందా?      

   -చెన్నా

జ: ఇలాంటి అంశాలకు సంబంధించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ను జత చేసి, కొవిడ్‌-19 పత్రాన్ని సమర్పిస్తే పరిగణించే అవకాశం ఉంది. ప్రయత్నించి చూడండి.


నేను ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాను. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగాలకు అర్హత ఉంటుందా?       

   -సాయి

జ: మీకు గ్రూప్‌-4 రాసుకోవడానికి అర్హత ఉంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులకు అవకాశం లేదు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని