కరెంట్‌ అఫైర్స్‌

షూటింగ్‌ ప్రపంచకప్‌ పురుషుల స్కీట్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత షూటర్‌గా మైరాజ్‌ అహ్మద్‌ఖాన్‌ రికార్డు నెలకొల్పాడు. ఫైనల్లో మైరాజ్‌ (37/40), మిన్సు కిమ్‌ (కొరియా, 36), బెన్‌ లెవెలిన్‌ (బ్రిటన్‌, 26)పై నెగ్గి విజేతగా నిలిచాడు. పంట సరళిలో మార్పులు,

Published : 20 Jul 2022 02:38 IST

షూటింగ్‌ ప్రపంచకప్‌ స్కీట్‌లో మైరాజ్‌కు తొలి స్వర్ణం

షూటింగ్‌ ప్రపంచకప్‌ పురుషుల స్కీట్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత షూటర్‌గా మైరాజ్‌ అహ్మద్‌ఖాన్‌ రికార్డు నెలకొల్పాడు. ఫైనల్లో మైరాజ్‌ (37/40), మిన్సు కిమ్‌ (కొరియా, 36), బెన్‌ లెవెలిన్‌ (బ్రిటన్‌, 26)పై నెగ్గి విజేతగా నిలిచాడు.
పంట సరళిలో మార్పులు, కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) విధానాన్ని మరింత సమర్థంగా, పారదర్శకంగా మార్చడానికి కేంద్ర వ్యవసాయశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ను ఛైర్మన్‌గా నియమించింది.
నావల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇండీజినైజేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఐఐవో), సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ ఏర్పాటు చేసిన ‘స్వావలంబన్‌ - 2022’ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. నౌకాదళంలో స్వదేశీ సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ‘స్ప్రింట్‌ ఛాలెంజెస్‌’ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు.

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నిత్యావసరాల సరఫరాను నిరాటంకంగా కొనసాగించడానికి దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధిస్తున్నట్లు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె ప్రకటించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్‌టీపీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐఓసీ రాబోయే ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు