కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల ట్రిపుల్‌ జంప్‌లో వెనిజులా స్టార్‌ యులిమర్‌ రొజాస్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. ఆమె వరుసగా మూడో ప్రపంచ టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్లో రొజాస్‌ 15.47 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచింది. రికెట్స్‌ (14.89 మీ., జమైకా)

Published : 21 Jul 2022 00:22 IST

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రొజాస్‌కు హ్యాట్రిక్‌ టైటిల్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల ట్రిపుల్‌ జంప్‌లో వెనిజులా స్టార్‌ యులిమర్‌ రొజాస్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. ఆమె వరుసగా మూడో ప్రపంచ టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్లో రొజాస్‌ 15.47 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచింది. రికెట్స్‌ (14.89 మీ., జమైకా) రజతం, టోరీ ఫ్రాంక్లిన్‌ (14.72 మీ., అమెరికా) కాంస్యం నెగ్గారు. 2017, 2019 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ రొజాస్‌ స్వర్ణం గెలిచింది.


ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ ప్రతిభారాయ్‌ జాతీయ సాహిత్య పురస్కారం-2022కి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని   జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, మహాకవి డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి పేరిట సుశీల నారాయణ రెడ్డి ట్రస్టువారు నెలకొల్పారు.


ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత వర్ధమాన క్రీడాకారిణి హర్షద గరుడ్‌ మహిళల 45 కేజీల విభాగంలో స్వర్ణ్ణం గెలిచింది. మొత్తం 157 కిలోలు (69 కేజీలు+88 కేజీలు) ఎత్తి అగ్రస్థానం సాధించింది.


ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ 25 మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో టీనేజ్‌ షూటర్లు అనిష్‌ భన్వాలా, రిథమ్‌ సాంగ్వాన్‌ కాంస్యం గెలుచుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఈ జంట 16-12తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అనా దెదోవా, మార్టిన్‌ పొద్రాస్కీ జోడీపై విజయం సాధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని