కరెంట్‌ అఫైర్స్‌

భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ చేసిన ప్రకటన ప్రకారం ఆమెకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు

Published : 23 Jul 2022 02:06 IST

15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము

భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ చేసిన ప్రకటన ప్రకారం ఆమెకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు.ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ  వయసున్న వ్యక్తి కూడా ఆమే.


అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన కౌశిక్‌ రాజశేఖర ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ ఎనర్జీ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. విద్యుత్తు రవాణా, శక్తిసామర్థ్య సాంకేతికతల రంగంలో విద్యుత్తు ఉత్పాదక ఉద్గారాలను తగ్గించడంలో అందించిన సేవలకుగాను ఆయనకు ఈ బహుమతి దక్కింది.


శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘె (73) ప్రమాణ స్వీకారం చేశారు.


ప్రముఖ బిజినెస్‌ పత్రిక ఫోర్బ్స్‌ ఇండియా ప్రకటించిన ‘టాప్‌ 100 డిజిటల్‌ స్టార్స్‌’లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువకుడు సయ్యద్‌ 32వ స్థానంలో నిలిచారు. ఈయన యూట్యూబ్‌లో నిర్వహిస్తున్న ‘తెలుగు టెక్‌టట్స్‌’కు ఈ గుర్తింపు లభించింది. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న సయ్యద్‌ 2011లో ‘తెలుగు టెక్‌టట్స్‌’ పేరిట ఛానల్‌ ప్రారంభించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని