ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను 2001-2002లో పదో తరగతి పూర్తి చేశాను. పదిహేడు సంవత్సరాల తర్వాత తిరిగి 2019లో ఒక యూనివర్సిటీకి ఎంట్రెన్స్‌ రాసి దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాను. ఇంటర్‌ లేకుండా గ్రూప్స్‌ రాసుకోవడానికి నాకు అర్హత ఉంటుందా?  

Published : 23 Jul 2022 02:06 IST

నేను 2001-2002లో పదో తరగతి పూర్తి చేశాను. పదిహేడు సంవత్సరాల తర్వాత తిరిగి 2019లో ఒక యూనివర్సిటీకి ఎంట్రెన్స్‌ రాసి దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాను. ఇంటర్‌ లేకుండా గ్రూప్స్‌ రాసుకోవడానికి నాకు అర్హత ఉంటుందా?  

     - చల్లా

జ: మీరు డిగ్రీ పూర్తిచేశారు కాబట్టి గ్రూప్స్‌ రాయడానికి అర్హత ఉంటుంది.

నేను కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తున్నాను. సాలీనా ఆదాయం రూ.8 లక్షలకు పైగా ఉంది. ఇతరత్రా ఆదాయాలు లేవు. నాకు నాన్‌-క్రీమీలేయర్‌ వర్తిస్తుందా?      

        - రవి

జ: మీరు నాన్‌-క్రీమీలేయర్‌ పరిధిలోకిరారు. క్రీమీలేయర్‌ కిందికే వస్తారు.

గ్రూప్‌-4 రాయడానికి ఇంటర్‌ పూర్తయితే సరిపోతుందా? నా స్నేహితులు రకరకాలుగా చెబుతున్నారు.     

    - కర్ణే

జ: గ్రూప్‌-4 రాయడానికి ఇంటర్‌ పూర్తయితే సరిపోతుంది. ఎలాంటి సందేహాలు లేకుండా బాగా ప్రిపేర్‌ అవ్వండి.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తులో పొరపాటున నేను క్రీమీలేయర్‌ కిందకు వస్తానని నింపాను. ఇప్పుడు మార్చుకునే వీలుందా. నాది బీసీ-బీ కేటగిరీ.      

 - సాకేత్‌

జ: టీఎస్‌పీఎస్సీ ఇటీవల ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చింది. ఈనెల 28 వరకు మీరు దరఖాస్తులో మార్పులు చేసుకోవచ్చు.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మెటీరియల్‌ను అందరూ చదువుతారు. కానీ పోటీలో ముందు ఉండాలంటే వివిధ మార్గాల్లో సేకరించుకున్న సమాచారంతో సొంత నోట్స్‌ రాసుకొని అధ్యయనం చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని