ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు వరంగల్‌, అయిదు నుంచి ఏడో తరగతి వరకు కరీంనగర్‌లో చదివాను. తర్వాత ఎనిమిది చదవకుండా తొమ్మిది, పది వరంగల్‌లో పూర్తి చేశాను.

Published : 24 Jul 2022 00:49 IST

* నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు వరంగల్‌, అయిదు నుంచి ఏడో తరగతి వరకు కరీంనగర్‌లో చదివాను. తర్వాత ఎనిమిది చదవకుండా తొమ్మిది, పది వరంగల్‌లో పూర్తి చేశాను. ఎనిమిదో తరగతికి సంబంధించిన  స్టడీ సర్టిఫికెట్‌ను ఎలా పొందాలి?

- రమేష్‌

జ: మీరు వరంగల్‌లో స్థానికతను పొందుతారు. ఎనిమిదో తరగతి చదవలేదు కాబట్టి  స్టడీ సర్టిఫికెట్‌కు బదులు ఆ కాలానికి సంబంధించి తహసీల్దారు నుంచి నివాస ధ్రువీకరణ పత్రాన్ని పొందండి.

* నేను టీటీసీ పూర్తి చేసి డిగ్రీ చేస్తున్నాను. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో చదివాను. మూడో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన  బోనఫైడ్లు నా దగ్గర లేవు. రెండు మీడియంలలో మూడో తరగతి (రెండు సార్లు) చదివాను. ఇప్పుడు నేను ఏం చేయాలి?

- వెంకట రమణ

జ: మీరు తెలుగు మీడియంలో చదివిన ఒకటి, రెండు తరగతుల బోనఫైడ్‌లను సంబంధిత పాఠశాల నుంచి తీసుకోండి. మీ వద్ద ఇంగ్లిష్‌ మీడియంలో మూడు నుంచి ఏడో తరగతి వరకు ఉన్న బోనఫైడ్లు స్థానికత కోసం సరిపోతాయి.

* నేను ఆరోతరగతి వరకు వరుసగా చదివాను. తర్వాత ఏడో తరగతి చదవకుండా ఎనిమిదో తరగతి పూర్తి చేశాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌కి సంబంధించిన దరఖాస్తులో ఏడో తరగతి కాలమ్‌ను ఎలా నింపాలి?

-బూరం

జ: మీరు ఏడో తరగతి కాలమ్‌లో డ్యాష్‌(-) పెట్టి మిగిలిన తరగతులకు వివరాలను నింపండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు