కరెంట్‌ అఫైర్స్‌

2020 సంవత్సరానికిగాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జి.ఆర్‌.గోపినాథ్‌ జీవితకథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో...

Published : 24 Jul 2022 00:49 IST

68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

2020 సంవత్సరానికిగాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జి.ఆర్‌.గోపినాథ్‌ జీవితకథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన ‘సూరరై పోట్రు’ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇదే తొలి జాతీయ అవార్డు. ‘కలర్‌ ఫొటో’ తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. తెలుగు చిత్రం ‘నాట్యం’ ఉత్తమ నృత్యాలు, మేకప్‌ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఉత్తమ సంగీతానికి (పాటలు) పురస్కారాన్ని దక్కించుకుంది.

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘ఇండియన్‌ అంటార్కిటిక్‌ బిల్లు - 2022’ను ప్రవేశపెట్టి ఆమోదించింది. అంటార్కిటికాలో ఉన్న మన దేశానికి చెందిన రెండు కేంద్రాలు మైత్రి, భారతిలలో ఉండే శాస్త్రవేత్తలకు, వారి పరిశోధనలకు మన చట్టాలు వర్తింపజేసేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.

సీనియర్‌ రాజకీయవేత్త, మహాజన ఏక్‌సాథ్‌ పెరమున (ఎంఈపీ) పార్టీ నేత దినేశ్‌ గుణవర్దెన (73) శ్రీలంక కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. నెదర్లాండ్స్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన గుణవర్దెన 1979లో తన తండ్రి ఫిలిప్‌ గుణవర్దెన నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించారు.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

సంస్కృతి అధ్యయనంలో ఆచార వ్యవహారాలు, జీవనశైలి, కళలు, సాహిత్యం, ఆర్థికాంశాలు, సాంఘిక నిర్మితులు తదితరాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని