ఇది డిజిటల్‌ రఫ్‌ పాడ్‌!

విద్యార్థులకు రఫ్‌ పాడ్‌ అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లెక్కలు చదువుకునేవారికి దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇదివరకూ ఒక పుస్తకాన్ని ప్రత్యేకంగా దీనికోసమే కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం

Updated : 12 Aug 2022 13:00 IST

విద్యార్థి నేస్తం

విద్యార్థులకు రఫ్‌ పాడ్‌ అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లెక్కలు చదువుకునేవారికి దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇదివరకూ ఒక పుస్తకాన్ని ప్రత్యేకంగా దీనికోసమే కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా డిజిటల్‌ రఫ్‌ పాడ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. 15 అంగుళాల ఎల్‌సీడీ తెరతో వచ్చే దీనికి జతగా ఒక స్మార్ట్‌ పెన్‌ కూడా ఇస్తారు. దాంతో ఈ తెరపై మనకు నచ్చింది రాసుకోవచ్చు. మొత్తం నిండిపోతే సింపుల్‌గా క్లియర్‌ బటన్‌ నొక్కితే సరి! అంతా అదే చెరిగిపోతుంది. పొరపాటున చేయి తగిలి అలా చెరిగిపోకుండా మనం రాసుకునేటప్పుడు స్క్రీన్‌ను లాక్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అంతేకాదు... ఈ పాడ్‌లోని రంగు, లైటింగ్‌లను ఎంతసేపు వాడినా కంటి మీద చెడుప్రభావం చూపని విధంగా తయారుచేశారు. అందువల్ల మనకు నచ్చినంత సమయం దీని సాయంతో చదువుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని