మెక్‌కెయాన్‌ ప్రపంచ రికార్డు

టీ20ల్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా ఫ్రాన్స్‌ క్రీడాకారుడు గుస్తావ్‌ మెక్‌కెయాన్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ ఐరోపా ఉప ప్రాంతీయ క్వాలిఫయర్‌ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసి మెక్‌కెయాన్‌ (109; 61 బంతుల్లో 5×4, 9×6) ఈ ఘనత సాధించాడు.

Published : 28 Jul 2022 02:00 IST

కరెంట్‌అఫైర్స్‌

టీ20ల్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా ఫ్రాన్స్‌ క్రీడాకారుడు గుస్తావ్‌ మెక్‌కెయాన్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ ఐరోపా ఉప ప్రాంతీయ క్వాలిఫయర్‌ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసి మెక్‌కెయాన్‌ (109; 61 బంతుల్లో 5×4, 9×6) ఈ ఘనత సాధించాడు. ఆయన  వయసు 18 ఏళ్ల 280 రోజులు. అఫ్గానిస్థాన్‌ బ్యాటర్‌ హజ్రతుల్లా జజాయ్‌ (20 ఏళ్ల 337 రోజులు; 162 నాటౌట్‌, 2019లో ఐర్లాండ్‌పై) పేరిట ఉన్న రికార్డును గుస్తావ్‌ అధిగమించాడు.
ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్‌ అధిపతి యూరి బోరిసోవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.
నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ 2022 జులై 26న బాధ్యతలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ గత సీఈఓ విక్రమ్‌ లిమాయే స్థానాన్ని చౌహాన్‌ భర్తీ చేశారు.
జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే-5 ప్రకారం తెలంగాణ మహిళల్లో రక్తహీనత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో 15-49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 57.8 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దేశంలోని పెద్ద రాష్ట్రాల కేటగిరీలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 71.7 శాతం మంది బాధితులు నమోదయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని