ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను బీసీ-బీ కేటగిరీ అభ్యర్థిని. నా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ జూన్‌ 30, 1973. ఇటీవల గ్రూప్‌-1కి దరఖాస్తు చేస్తే వయసు ఎక్కువనే కారణంతో తిరస్కరించారు. గ్రూప్‌-2, 3, 4 పోస్టులకు అర్హత ఉంటుందా?   

Published : 28 Jul 2022 02:09 IST

నేను బీసీ-బీ కేటగిరీ అభ్యర్థిని. నా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ జూన్‌ 30, 1973. ఇటీవల గ్రూప్‌-1కి దరఖాస్తు చేస్తే వయసు ఎక్కువనే కారణంతో తిరస్కరించారు. గ్రూప్‌-2, 3, 4 పోస్టులకు అర్హత ఉంటుందా?                           

 - ఒక అభ్యర్థి

జ: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకారం జనరల్‌ అభ్యర్థులకు వయసు పరిమితి 44 సంవత్సరాలు. రిజర్వేషన్‌ కింద అయిదేళ్లు సడలించినా 2022 జులై 1 కటాఫ్‌ తేదీకి మీ వయసు 49 సంవత్సరాలు దాటి ఒక రోజు గడిచింది. కాబట్టి నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించే  గ్రూప్‌-1, 2, 3, 4 తదితర ఉద్యోగాలకు మీకు అర్హత ఉండదు.


ఎమ్మెస్సీ పూర్తి చేశాను. బీఈడీ చేయలేదు. నాకు గురుకుల జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుకు అర్హత ఉంటుందా?                            

  - ఉపేంద్ర

జ: మీకు గురుకుల జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుకు అర్హత ఉంది. పీజీటీ పోస్టులకు అర్హత ఉండదు.


టీఎస్‌పీఎస్సీ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో కచ్చితంగా రిజిస్టర్‌ కావాలా? పీసీఐ సర్టిఫికెట్‌ లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చా?  

- మహేశ్వరి

జ: టీఎస్‌పీఎస్సీ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే బీ-ఫార్మసీ సర్టిఫికెట్‌ ఉంటే సరిపోతుంది. పీసీఐ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు.


మీ సందేహాలను పోస్ట్‌ చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. help@eenadupratibha.net


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని