ప్రాక్టీస్‌ బిట్లు

1. ఇస్రో అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహ ప్రయోగాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?

Updated : 29 Jul 2022 01:34 IST

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

1. ఇస్రో అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహ ప్రయోగాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
  1) ఇండియన్‌ మార్స్‌ మిషన్‌    2) మంగళ్‌యాన్‌
  3) మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌     4) పైవన్నీ

2. భారతదేశ అంగారక గ్రహ యాత్రకు సంబంధించి సరైంది?
  1) దీన్ని పీఎస్‌ఎల్‌వీ - సీ25 ద్వారా ప్రయోగించారు.
  2) రూ.450 కోట్ల అతి తక్కువ ఖర్చుతో పూర్తిచేశారు.
  3) తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన మొదటి దేశం భారత్‌.   4) పైవన్నీ

3. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ ఉపగ్రహాల సహాయంతో తీసిన భూమి చిత్రాలను ఏమని పిలుస్తున్నారు?
  1) ధరిత్రి   2) భువన్‌   3) గగన్‌   4) భారత్‌ పిక్చర్స్‌

4. ఒక వస్తువును తాకకుండా దాని సమాచారం సేకరించడాన్ని ఏమంటారు?
  1) రిమోట్‌ ఇమేజింగ్‌   2) ఇన్‌ఫర్మేషన్‌ ట్రాకింగ్‌
  3) రిమోట్‌ సెన్సింగ్‌    4) రిమోట్‌ గ్యాదరింగ్‌

5. సూర్యుడి కరోనా, వాతావరణ అధ్యయనానికి ఇస్రో రూపొందించిన ఉపగ్రహం?
  1) ఆదిత్య - ఎల్‌    2) భాస్కర - ఎల్‌
  3) సూర్య - ఎం    4) సన్‌శాట్‌ - ఎల్‌

6. ప్రభుత్వ పరిపాలన, సేవల కోసం సమాచార సాంకేతికతను వినియోగించడాన్ని ఏమంటారు?
  1) ఈ - గవర్నెన్స్‌    2) స్మార్ట్‌ పరిపాలన
  3) సాంకేతిక పాలన   4) టెక్నాలజీ గవర్నెన్స్‌

సమాధానాలు: 1-4; 2-4; 3-2; 4-3; 5-1; 6-1.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని