ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను హైదరాబాద్‌ జిల్లాలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ)కి పోటీ పడదామనుకుంటున్నాను. సొంత జిల్లా కరీంనగర్‌. ఓపెన్‌ కేటగిరీ 5 శాతం పోస్టులకు అర్హులు

Updated : 29 Jul 2022 02:54 IST

నేను హైదరాబాద్‌ జిల్లాలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ)కి పోటీ పడదామనుకుంటున్నాను. సొంత జిల్లా కరీంనగర్‌. ఓపెన్‌ కేటగిరీ 5 శాతం పోస్టులకు అర్హులు అంటే ఏమిటి? నాది జనరల్‌ కేటగిరీ. సొంత జిల్లాను వదిలి పక్క జిల్లాకు వెళితే వచ్చే లాభనష్టాలను వివరించండి. 

- విరాట్‌

జ: ఓపెన్‌ కేటగిరీ 5 శాతం పోస్టులకు అర్హులు అంటే, ఉదాహరణకు 100 పోస్టులు ఉన్నాయనుకుంటే 95 పోస్టులను ఆ జిల్లా వారికే కేటాయిస్తారు. మిగిలిన  అయిదు పోస్టులకు మాత్రమే ఆ జిల్లాకు చెందిన వారితోపాటు ఇతరులనూ పోటీలో పరిగణనలోకి తీసుకుంటారు. ఆ అయిదు శాతం కోసం పోటీపడి ర్యాంకు తెచ్చుకోవడం కష్టం. కాబట్టి, మీ సొంత జిల్లాలోనే పరీక్ష రాసుకోవడం మంచిది.

నేను ఒక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాను. సాలీనా ఆదాయం రూ. 2 లక్షలు. బీసీ క్రీమీలేయర్‌ కింద ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చా? 

- ప్రవీణ్‌

జ: మీరు క్రీమీలేయర్‌ పరిధిలోకి రారు. మీకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని