ప్రాక్టీస్‌ బిట్లు

విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు ఎవరు?

Published : 30 Jul 2022 00:56 IST

భారతదేశ చరిత్ర

1. విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు ఎవరు?

 1)మంచన భట్టారక వర్మ 2)ఇంద్ర భట్టారక వర్మ 3) నాలుగో మాధవ వర్మ 4) విక్రమేంద్ర వర్మ

2. ఉండవల్లి గుహల్లో ఎన్ని అంతస్తులు ఉన్నాయి?

 1) మూడు అంతస్తులు 2) రెండు అంతస్తులు  3) అయిదు అంతస్తులు 4) నాలుగు అంతస్తులు

3. సంగం యుగం నాటి కవి పండితులను పోషించిన రాజవంశం ఏది?

 1) చోళ  2) పాండ్య 3) పల్లవ 4) చేర

4. తొల్కప్పియం గ్రంథం ఏ విషయానికి సంబంధించింది?

 1) రాజుల చరిత్ర     2) సంగీతం  3) నృత్యం  4) వ్యాకరణం

5. చోళుల భూభాగాన్ని ఏమని పిలిచేవారు?

 1) తొండై మండలం  2) మలబార్‌ 3) వేంగడం  4) ఏదీకాదు

6. చోళుల రాజ చిహ్నం ఏది?

 1) ధనస్సు  2) పులి 3) చేప  4) సింహం

7. శ్రీగుప్తుడు చైనా బౌద్ధ సన్యాసుల కోసం మృగశిఖావనం దగ్గర ఒక దేవాలయాన్ని నిర్మించినట్లు పేర్కొన్న చైనా యాత్రికుడెవరు?

 1) హుయాన్‌త్సాంగ్‌  2) ఫాహియాన్‌ 3) ఇత్సింగ్‌   4) ఎవరూకాదు

8. ‘నవరత్నాలు’ ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

1) సముద్రగుప్తుడు  2) మొదటి చంద్రగుప్తుడు  3) రెండో చంద్రగుప్తుడు 4) ఎవరూకాదు

9. గుప్త సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు?

1) విషయ 2) గ్రామ  3) భుక్తి  4) ఏదీకాదు

సమాధానాలు : 1-1; 2-4; 3-2; 4-4; 5-1; 6-2; 7-3; 8-3; 9-3. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని