ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఎంకామ్, బీఈడీ చేశాను. టీఎస్‌ టెట్‌లో క్వాలిఫై అయ్యాను. గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా?

Published : 30 Jul 2022 00:58 IST

నేను ఎంకామ్, బీఈడీ చేశాను. టీఎస్‌ టెట్‌లో క్వాలిఫై అయ్యాను. గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా?

- ఒక అభ్యర్థి

జ: మీరు గురుకులాల్లోని ఎస్‌జీటీ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఎంకామ్‌ విద్యార్హతతో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకూ ప్రయత్నించవచ్చు.

నాపై సెక్షన్‌ 324 ఆర్‌/డబ్ల్యూ 34 కేసు ఫైల్‌ అయ్యింది. ప్రస్తుతం కేసు క్లోజ్‌ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నాను. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సమయంలో ఏదైనా సమస్య ఉంటుందా?

- సందీప్‌

జ: మీకు శిక్ష పడలేదు కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవ్వండి.

నేను ఎంబీఏ హెచ్‌ఆర్‌లో స్పెషలైజేషన్‌ చేశాను. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగాలు ఉంటాయా?

- సురేష్‌

జ: టీఎస్‌పీఎస్సీలో ఎంబీఏ స్పెషలైజేషన్‌ చేసిన వారికి ప్రత్యేకించి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉండవు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ 1, 2, 3, 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని