ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నాపైన క్రిమినల్‌ కేసు 308 పెండింగ్‌లో ఉంది. టీఎస్‌పీఎస్సీ, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్వహించే పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉందా?

Published : 31 Jul 2022 00:54 IST

నాపైన క్రిమినల్‌ కేసు 308 పెండింగ్‌లో ఉంది. టీఎస్‌పీఎస్సీ, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్వహించే పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉందా?

- రాజేష్‌

జ: ఇప్పటివరకు ఎలాంటి శిక్ష పడలేదు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది. అయితే కేసుకి సంబంధించిన వివరాలను దరఖాస్తులో తెలియజేయండి.

నేను 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి లైబ్రరీ సైన్స్‌ పూర్తి చేశాను. టీఎస్‌పీఎస్సీ, గురుకుల ఉద్యోగాలకు అర్హత ఉంటుందా?

- శరత్‌

జ: డిగ్రీ నాగార్జున యూనివర్సిటీ నుంచి పూర్తి చేసినప్పటికీ మీరు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివి ఉంటే టీఎస్‌పీఎస్సీ, గురుకుల ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.

నేను తెలంగాణ టెట్‌-2022లో పేపర్‌-2 కి అర్హత సాధించాను. పేపర్‌-1లో 88 మార్కులు మాత్రమే వచ్చాయి. బీసీ-డి కేటగిరీ. మరొకసారి పరీక్ష రాసి పేపర్‌-1కు అర్హత పొందాల్సి ఉందా?

- ఆర్‌వీఎన్‌ రాజు

జ: బీసీ-డి కేటగిరీకి పేపర్‌-1లో మీరు సాధించిన మార్కులు సరిపోతాయి. కాబట్టి, మరొకసారి పరీక్ష రాసి అర్హత సాధించాల్సిన అవసరం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని